Breaking News

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో ట్విస్ట్‌.. ప్రభాకర్‌ రావుకు ఝలక్‌!

Published on Thu, 07/10/2025 - 12:10

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సిట్‌ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు డీసీపీ విజయ్‌కుమార్‌, ఏసీపీ వెంకటగిరి ఢిల్లీకి వెళ్లారు.

అయితే, గతంలో ప్రభాకర్‌ రావును అరెస్ట్‌ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మినహాయింపులు రద్దు చేయాలని సుప్రీంకోర్టును సిట్‌ అధికారులు కోరనున్నారు. ప్రభాకర్‌ రావు విచారణకు సహకరించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభాకర్‌ రావును కస్టడీకి తీసుకోవాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను సిట్‌ అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు డేటా కీలకంగా మారనుంది. వీటి నుంచి డేటాను సేకరించి పనిలో అధికారులు ఉన్నారు. ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కి సిట్ అధికారులు పంపించారు. ఈ క్రమంలో 2023 అక్టోబర్ నుండి మార్చి15 వరకు కాల్ డేటాను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ప్రభాకర్‌ రావు.. పలువురు బీఆర్‌ఎస్‌ నేతలతో, పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్టు సిట్‌ అనుమానం వ్యక్తం చేస్తోంది.

ఇక, ఇప్పటికే నిందితులు, బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్‌ అధికారులు ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. రేపు మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు రానున్నారు. 2023 నవంబర్ 15 నుండి 30 వరకు అందిన సర్వీసు ప్రొవైడర్ డేటాలో 618 ఫోన్ నెంబర్లను సిట్‌ గుర్తించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ధ్వంసమైన హార్డ్ డిస్కులలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డేటా ఉన్నట్టు సమాచారం. దీంతో, సిట్‌ అధికారులు.. హార్డ్ డిస్కులపైన ఆశలు పెట్టుకున్నారు. డేటా రిట్రైవ్, హార్డ్‌ డిస్కులోని రహస్యాలపై సిట్ ఆరా తీస్తోంది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)