Breaking News

కేసీఆర్‌ ఒక్కరికే అనుమతి! సిట్‌ విచారణ ఇలా..

Published on Sun, 02/01/2026 - 13:00

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మరికాసేపట్లో సిట్‌ విచారణ జరపనుంది. ఎర్రవెల్లి ఫాంహౌజ్‌ నుంచి ఆయన నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కంటే ముందే పోలీసులు, సిట్‌ బృందం నందినగర్‌లోని నివాసానికి చేరుకుంది. కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే ఇంట్లోకి అనుమతిస్తూ.. మిగతా వాళ్లను బయటకు పంపించేశారు. అంతకు ముందు.. 

ఎర్రవెల్లి ఫాంహౌజ్‌ నుంచి బీఆర్‌ఎస్‌ శ్రేణులతో కేసీఆర్‌ హైదరాబాద్‌ బయల్దేరారు. ఆ సమయంలో ఒంటి మామిడి వద్ద మిగతా వాహనాలను అడ్డుకుని.. కేసీఆర్‌ కాన్వాయ్‌ను మాత్రమే అధికారులు ముందుకు అనుమతించారు. ఇటు.. 

ఎలక్ట్రానిక్‌ పరికరాలతో నందినగర్‌ నివాసానికి సిట్‌ అధికారులు చేరుకున్నారు. ఇంటి రెండో ఫ్లోర్‌లోని ఓ గదిలోని కేసీఆర్‌ను విచారించేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఆ గదిని అధికారులు ఆ పరికరాలతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే.. కేసీఆర్‌ స్టేట్‌మెంట్‌ను వీడియో రికార్డింగ్‌ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

నందినగర్‌ నివాసంలో ఉండేందుకు కుటుంబ సభ్యులైన హరీష్‌రావు, కేటీఆర్‌, సంతోష్‌రావులకు మాత్రమే అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. అలాగే విచారణ రూమ్‌లోకి కేసీఆర్‌ వెంట లాయర్‌కు కూడా అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ కీలక నేతలను గంటల తరబడి సిట్‌ అధికారుల ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే బీఆర్‌ఎస్‌ ఆందోళనల నడుమ.. కేసీఆర్‌ను ఎంతసేపు విచారిస్తారు? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)