Breaking News

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌రావుకు ఊరట

Published on Thu, 05/29/2025 - 12:41

సాక్షి, న్యూఢిల్లీ: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌, ఏ1 నిందితుడు ప్రభాకర్‌రావుకు ఊరట లభించింది. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఆయన పాస్‌పోర్టును పునరుద్ధరించాలని సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. అదే సమయంలో తదుపరి విచారణ దాకా ఆయన్ని అరెస్ట్‌ చేయొద్దని ప్రత్యేక దర్యాప్తు బృందానికి(SIT) తేల్చి చెప్పింది.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.  జస్టిస్ బీవీ నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులను అడ్వాంటేజ్‌గా తీసుకోవద్దని.. దేశానికి వచ్చిన వెంటనే మూడు రోజుల వ్యవధిలోనే దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ద్విసభ్య ధర్మాసనం ప్రభాకర్‌రావుకు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. 

ప్రభాకర్ రావు తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘‘నేను 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ అధికారిగా సేవలందించాను. నాకు వ్యతిరేకంగా తప్పుడు కేసులు పెట్టారు. పాస్‌పోర్టు ఇస్తే నేను దేశానికి వస్తాను. విచారణకు సహకరిస్తా. గతంలో అనేకమందికి ఈ కేసులో బెయిల్  ఇచ్చారు’’ అని కోర్టుకు ప్రభాకర్‌రావు విజ్ఞప్తిని తెలియజేశారు. 

ప్రభుత్వం తరఫున వాదనలు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ‘‘ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ప్రభాకర్ రావు  దేశం విడిచి పారిపోయాడు. పరారీలో ఉన్న నేరస్తుడు షరతులు పెట్టడానికి వీల్లేదు. ముందస్తు బెయిల్ ఇస్తానంటేనే, దేశానికి వస్తానని చెప్పడం ఆమోదయోగ్యం కాదు. ఇదిలాగే కొనసాగితే సాంప్రదాయంగా మారుతుంది. ప్రభాకర్ రావును మేము కచ్చితంగా అరెస్టు చేస్తాం. ఆయన చాలా తీవ్రమైన నేరాలకు పాల్పడ్డాడు. ఆ నేరాల తీవ్రత తెలిసే , చెన్నై నుంచి అమెరికాకు పారిపోయాడు. కోర్టు అతన్ని ప్రకటిత నేరస్తుడిగా తీర్పు ఇచ్చింది. ప్రభాకర్ రావు పిటిషన్‌కు అసలు విచారణ అర్హత లేదు’’ అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపులా వాదనలు విన్న బెంచ్‌.. ప్రభాకర్‌రావుకు ఊరట ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

ఇదీ చదవండి: నేనూ తిక్కదాన్ని.. నాతో పెట్టుకోవద్దు

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు