Breaking News

HYD:చైనా మాంజా తగిలి టెకీకి గాయాలు

Published on Wed, 01/15/2025 - 15:41

సాక్షి,హైదరాబాద్‌:నగరంలో నిషేధిత చైనా మాంజా తగిలి మరొకరికి గాయాలయ్యాయి. ఉప్పల్‌ డీఎస్‌ఎల్‌ కంపెనీ భవనంలోని బైక్‌పై వెళ్తుండగా ఘటన జరిగింది. మాంజా దారం తగిలి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సాయివర్థన్‌రెడ్డి కింద పడిపోయారు. దీంతో అతడి మెడకు గాయమైంది. గాయాలపాలైన ఆయనను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సాయివర్ధన్‌రెడ్డి కుషాయిగూడకు చెందినవారు. 

చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించినప్పటికీ గాలిపటాలు ఎగురవేసేందుకు ఇప్పటికీ దానిని వాడుతున్నారు. పులువురు వ్యాపారులు పండగ వేళ సొమ్ము చేసుకునేందుకు అక్రమంగా చైనా మాంజా విక్రయాలు సాగిస్తున్నారు. గాలిపటాలు ఎగురవేయడంలో పక్కవారి మీద పైచేయి సాధించేందుకు చైనా మాంజాను వాడుతున్నారు.

 చైనా మాంజా వాడిన గాలిపటాలు దారంతో సహా  తెగి పడి రోడ్లపై వేలాడుతున్న చోట వాహనదారులు చూసుకోకుండా వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో వారు తీవ్ర గాయాలపాలవుతున్నారు. హైదరాబాద్‌లో పోలీసులు మంగళవారం జరిపిన దాడుల్లో చైనా మాంజా భారీగా పట్టుబడడం గమనార్హం. 

ఇదీ చదవండి: మీకు తెలియకుండా మీ ఫొటోలు ఇన్‌స్టాలో

 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)