Breaking News

ఆ ఇథనాల్‌ ఫ్యాక్టరీ తలసాని కొడుకుదే: కాంగ్రెస్‌

Published on Wed, 11/27/2024 - 19:01

నిర్మల్ : దిలావర్ పూర్‌లో ఇథనాల్  పరిశ్రమను వ్యతిరేకిస్తూ స్థానికులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీసింది తెలిసిందే. దీంతో కలెక్టర్‌ పనులను ఆపేయించారు. అయితే ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండగా.. కాంగ్రెస్‌ కౌంటర్‌కు దిగింది. 

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ‘దిలావర్‌పూర్‌ ఇథనాల్  పరిశ్రమ బీఆర్‌ఎస్‌ నేత తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమారుడిదే. ఇథనాల్‌ ఫ్యాక్టరీతో జనాల్ని ముంచాలని కేసీఆర్‌ చూశారు. అందుకే తలసాని కొడుకు సాయి సంస్థకు అప్పగించారు.  కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది కేసీఆర్, కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వానికి, ఆ ఇథనాల్ కంపెనీకి సంబంధం ఏంటి? ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఎవరిదో తేల్చుకునేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు దిలావర్ పూర్‌కి రావాలి. వారితో పాటు మేమూ వస్తాం. అక్కడికి వెళ్లి తప్పెవరిదో? తేల్చుకుందాం’ అని అన్నారు. ఇథనాల్‌ ఫ్యాక్టరీపై పూర్వపరాలు పరిశీలించాకే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారాయన.

 కాగా, నిర్మల్  జిల్లా దిలావర్ పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇథనాల్  పరిశ్రమ ఏర్పాటుకు నిరసనగా స్థానికులు ఆందోళనకు దిగారు.  పోలీస్‌స్టేషన్‌ నుంచి నిర్మల్ - భైంసా రహదారి వైపు నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానికుల నిరసనతో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనలో భారీగా పాల్గొన్న మహిళలు. ఇథనాలు పరిశ్రమను రద్దు చేయాలని డిమాండ్  చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చిరించారు. దీంతో అధికార యంత్రాగం పనుల్ని ఆపేయించి.. చర్చలకు పిలిచింది. అదే సమయంలో.. 

ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. గత ప్రభుత్వ హయాంలో ఈ అనుమతులు జారీ అయ్యాయని గుర్తించింది. ఫ్యాక్టరీ అనుమతులపై సమీక్షించి.. అవసరమైతే వాటిని రద్దు చేయాలని యోచిస్తోన్నట్లు సమాచారం. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)