ఎన్‌ఆర్‌ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం

Published on Fri, 05/17/2024 - 09:27

జహీరాబాద్‌: అమెరికాలోని చోర్లెట్‌ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంతానికి చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్‌ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. పృపృథ్వీరాజ్‌ ఎనిమిదేళ్ల క్రితం ఐటీ ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లాడు. ఏడాదిన్నర కిందట సిద్దిపేట ప్రాంతానికి చెందిన శ్రీప్రియతో వివాహం జరిగింది.

భార్యాభర్తలు బయటకు వెళ్లి పని ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. రోడ్డుపై నిలిచి ఉన్న ఓ వాహనాన్ని పృథ్వీరాజ్‌ నడుపుతున్న కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు బెలూన్లు తెరుచుకోవడంతో భార్యాభర్తలిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ప్రమాదం అనంతరం వారు రహదారికి మరోవైపు చేరుకున్నారు. కాగా, ప్రమాదం జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు పృథ్వీరాజ్‌ కారులో ఉండిపోయిన సెల్‌ఫోన్‌ కోసం వెళుతూ.. మళ్లీ రోడ్డు దాటుతున్న క్రమంలో అదే సమయంలో వేగంగా వచి్చన వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పృథ్వీ మృతదేహం శనివారం లేదా ఆదివారం ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని బంధువులు తెలిపారు.

అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)