Breaking News

ప్రణీత్‌రావు ఫోన్‌ ట్యాపింగ్‌ ఎపిసోడ్‌లో కొత్త కోణం..

Published on Mon, 03/25/2024 - 19:46

సాక్షి, హైదరాబాద్‌: ప్రణీత్‌ రావుఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. రియల్‌ ఎస్టేట్‌, ఫార్మా, సాఫ్ట్‌వేర్‌ కంపెనీ యజమానుల ఫోన్లను ప్రణీత్‌ ట్యాప్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిపక్ష నేతలతో టచ్‌లోకి వెళ్లిన రాజకీయ, వ్యాపారులను ప్రణీత్‌రావు గ్యాంగ్‌ బెదిరించినట్లు తెలిసింది. వ్యాపార వేత్తల వాయిస్‌ను వారికే వినిపించి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. 

ఆడియోలు బయటకు రావొద్దంటే బీఆర్‌ఎస్‌ నేతలకు డబ్బులు ఇవ్వాలని ప్రణీత్‌ రావు డిమాండ్‌ చేసినట్లు వెల్లడైంది. బెదిరింపు ఆడియోలను వ్యాపారుల ముందు పెట్టి వారిచేత ప్రణీత్‌ గ్యాంగ్‌ ఎలక్టోరల్‌ బాండ్స్‌ కొనిపించినట్లు గుర్తించారు.  కొన్ని సంవత్సరాలుగా వ్యాపారులు అత్యధికంగా బీర్‌ఎస్‌కు ఎలక్టోరల్‌ బాండ్లు కొన్నట్లు తేలింది.
చదవండి: ప్రణీత్‌రావు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలనాలు

మరోవైపు ప్రణీత్‌రావు ఫోన్‌ ట్యాపింగ్‌ ఎపిసోడ్‌లో రవిపాల్‌ కీలకంగా మారారు. ఎస్‌ఐబీ టెక్నికల్‌ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్‌ నేతృత్యంలోనే ట్యాపింగ్‌ డివైజ్‌లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా డివైజ్‌ను తీసుకొచ్చిన రవిపాల్‌, ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పేరుతో ఇజ్రాయిల్‌ నుంచి ట్యాపింగ్‌ డివైజ్‌లు దిగుమతి చేసినట్లు సమాచారం. ఇందుకు రవిపాల్‌కు ఎస్‌ఐబీ కోట్లలో డబ్లులు చెల్లించినట్లు తెలిసింది.

రవిపాల్‌, ప్రభాకర్‌ కలిసి ఆధునాతన డివైజ్‌లను దిగుమతి చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. 300 మీటర్ల పరిధిలో మాటలను వినే వీలున్న డివైజ్‌లు తెచ్చిన రవిపాల్‌ ..రేవంత్‌ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్‌ తీసుకొని డివైజ్‌ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. రేవంత్‌ ఇంట్లో జరిగే ప్రతి విషయన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్‌రావు, రవిపాల్‌ విన్నారు. ఈ క్రమంలో రవిపాల్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
చదవండి: ట్యాపింగ్‌ కేసులో ముగ్గురికి రిమాండ్‌

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)