Breaking News

నిజామాబాద్‌ సౌమ్య కేసులో కొత్త ట్విస్ట్

Published on Tue, 01/06/2026 - 16:43

సాక్షి, నిజామాబాద్: భర్తను హత్య చేసిన ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. భర్త పల్లటి రమేష్‌పై రూ.2 కోట్లకు పైగా ఇన్స్యూరెన్స్ ఉండగా.. బీమా డబ్బుల కోసమే భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్ పక్క ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోటం ఆపై ఇన్స్యూరెన్స్ డబ్బులతో పారిపోవడానికి ప్లాన్ చేశారు.

ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం నార్మల్ డెత్ గుండె పోటు అంటూ చిత్రీకరించారు. నిద్ర మాత్రలు ఇచ్చి భర్తగొంతు నులిమి హత్య చేసి హార్ట్ ఎటాక్‌గా భార్య నమ్మించింది. మృతుడి తమ్ముడి ఫిర్యాదుతో మృతదేహానికి రీపోస్టు మార్టం నిర్వహించారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో తామే హత్య చేసినట్లు  భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్ ఒప్పుకున్నారు.

పోలీసుల వెల్లడించిన వివరాలు ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బొర్గాం గ్రామానికి చెందిన పట్టాటి రమేష్‌ భార్య సౌమ్య ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తోంది. అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న దిలీప్‌తో ఆమెకు పరిచయం.. వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం భర్త రమేష్‌కు తెలియడంతో, ఇద్దరినీ గట్టిగా మందలించాడు.

దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని సౌమ్య ప్రియుడితో కలిసి ప్లాన్‌ చేసింది. గత నెల 20న సౌమ్య తన ప్రియుడు దిలీప్‌తో కలిసి రమేష్‌ను ఇంట్లోనే హత్య చేశారు. అనంతరం భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు నమ్మించి, ఎవరికీ అనుమానం రాకుండా హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, అంత్యక్రియల సమయంలో రమేష్‌ మెడపై గాట్లు కనిపించడంతో స్థానికులకు అనుమానం కలిగింది. వెంటనే ఇజ్రాయెల్‌లో ఉన్న అతని తమ్ముడు కేదారికి సమాచారం అందించడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి విచారణ చేపట్టగా అసలు నిజం బయటపడింది. ఈ కేసులో సౌమ్యతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)