Breaking News

వద్దంటే భర్త డ్యూటీకి వెళ్లాడని..

Published on Sat, 01/13/2024 - 08:49

హైదరాబాద్: నెల రోజుల క్రితమే నేపాల్‌లో వివాహం చేసుకుని భర్తతో నగరానికి వచ్చిన నేపాల్‌కు చెందిన యువతి అదృశ్యమైన సంఘటన నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. అడ్మిన్‌ ఎస్‌ఐ నరేష్‌ కుమార్‌ సమాచారం మేరకు... హిమాయత్‌నగర్‌ బ్లూ ఫాక్స్‌ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేసే సోను తాప నెల క్రితం నేపాల్‌లోని తన పక్క గ్రామం అంజ్‌కోట్‌కు చెందిన ఊర్మిళ (22) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితమే భార్య ఊర్మిళను నగరానికి తీసుకొచ్చాడు.

 హిమాయత్‌నగర్‌లోని ఉర్దూ హాల్‌ లేన్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని భార్యతో పాటు నివాసం ఉంటున్నాడు. ఈ నెల 9వ తేదీన మధ్యహ్నం 2 గంటల సమయంలో భర్త సోను డ్యూటీకి వెళ్తుండగా ఊర్మిళ ఈ రోజు డ్యూటీ వెళ్లవద్దని చెప్పిందని, అయినా సోను డ్యూటీకి వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో భార్య ఊర్మిళ తాను తన అమ్మవారి ఇంటికి నేపాల్‌కి తిరిగి వెళ్లిపోతున్నట్లు భర్తకు మెసేజ్‌ చేసింది. 

వెంటనే భర్త ఇంటికి వచ్చి చూడగా తాను కనిపించలేదని తన అమ్మవారింటికి వెళ్లిందని అనుకున్నాడు. అయితే రెండు రోజులు గడిచినా నేపాల్‌కి వెళ్లిందో లేదో అని ఊర్మిళ అమ్మవారికి ఫోన్‌ చేయగా లిఫ్ట్‌ చేయడం లేదని, భర్త నారాయణగూడ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్‌కుమార్‌ తెలిపారు.  

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)