Breaking News

హీరో వెంకటేష్‌, రానాలపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం

Published on Mon, 01/29/2024 - 11:10

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్ స్టార్ హీరోలు దగ్గుబాటి వెంకటేష్‌, రానాలకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ఫిలింనగర్‌ డెక్కన్‌ కిచెన్‌ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దగ్గుబాటి వెంకటేష్‌, సురేష్‌, రానా, అభిరామ్‌లపై కేసు నమోదు చేయాలని పోలీసులకు నాంపల్లి క్రిమినల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా డెక్కన్‌ కిచెన్‌ యజమాని నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కూల్చివేతకు పాల్పడ్డారని నంద కుమార్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్‌ను ధ్వంసం చేసి, ఫర్చిచర్ ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో ఆరోపించారు.

లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని పేర్కొన్నారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని హోటల్‌ను ధ్వంసం చేశారని అన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో వెంకటేష్‌, ఇతర కుటుంబ సభ్యులపై IPC 448, 452,380, 506,120b కింద కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
చదవండి: 24 మంది ఎమ్మెల్యేల ఎన్నికపై పిటిషన్లు.. కేటీఆర్‌, హరీశ్‌ విజయంపై కూడా

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)