Breaking News

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మహిళపై లైంగిక దాడి

Published on Tue, 10/27/2026 - 12:51

రంగారెడ్డి జిల్లా: మున్సిపల్‌ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఓ వివాహితను రిసార్ట్స్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఘట్‌కేసర్‌ పీఎస్‌ పరిధిలో సోమవారం జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ పి.కిరణ్‌  తెలిపిన మేరకు.. మల్లాపూర్‌కు చెందిన ఓ మహిళ (30) భర్తతో విడిపోయి టైలరింగ్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి చెందిన జగన్‌మోహన్‌ మోత్కూరు మున్సిపాలిటీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. 

ఇతడితో మహిళకు 4 నెలల క్రితం ఫోన్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. తాను భువనగిరి మేనేజర్‌గా పని చేస్తానని, రూ.5 లక్షలు ఇస్తే మున్సిపల్‌ ఆఫీసులో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో ఆమె సోమవారం రూ.4.5 లక్షలు సిద్ధం చేసుకోగా, జగన్‌మోహన్‌ కారులో వెళ్లి మల్లాపూర్‌లో ఎక్కించుకుని భువనగిరికి బయలుదేరారు. ప్రయాణించే సమయంలోనే  డబ్బు తీసుకొని కారులో భద్రపరుచుకున్నాడు. భువనగిరికి వెళ్లకుండా ఎదులాబాద్‌ డివిజన్‌ అవుషాపూర్‌ వద్ద శ్రీనిధి రిసార్ట్స్‌లోకి కారును మళ్లించగా బాధితురాలు అనుమానంతో  ప్రశ్నించింది. 

డబ్బులు తీసుకునే అధికారి రిసార్ట్స్‌లో ఉన్నాడని బదులిచ్చాడు. లోపలికి వెళ్లిన అనంతరం రిసార్ట్స్‌లోని ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అధికారిని కలుద్దామని ఆమె కోరడంతో కారులో ఎక్కించుకుని ఆమె ముఖంపై చేతులతో దాడి చేసి బయటకు తోసేసి వెళ్లిపోయాడు. బాధితురాలు 100కు డయల్‌ చేయగా ఘట్‌కేసర్‌ పోలీసులు వచ్చి  భరోసా కేంద్రానికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జగన్‌మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)