Breaking News

హైదరాబాద్‌లో సినిమా పైరసీ రాకెట్ గుట్టురట్టు

Published on Thu, 07/03/2025 - 15:16

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో సినిమా పైరసీ రాకెట్ గుట్టు రట్టయ్యింది. టాలీవుడ్‌లోని సినిమాలను పైరసీ చేసిన తూర్పుగోదావరికి చెందిన జన కిరణ్‌కుమార్ అనే వ్యక్తిని సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వనస్థలిపురంలో ఏసీ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పటివరకు 65 సినిమాలకు రికార్డు చేసినట్లు కిరణ్‌ పేర్కొన్నాడు. హెచ్‌డీ ప్రింట్‌ రూపంలో పైరసీ చేసి అమ్ముతున్న నిందితుడిని  పోలీసులు పట్టుకున్నారు.

నిందితుడిపై 66(c), 66(e) ఐటీ యాక్ట్, 318(4),r/w 3(5), 338 BNS, 63, 65 కాపీ రైట్, 6-AA,6AB,7(1A) సినిమాటోగ్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కామ్‌ కార్డ్‌ ద్వారా సినిమాలను పైరసీ చేస్తున్న కిరణ్‌కుమార్‌.. 1TAMILBLASTERS, 5MOVIEZRULZ, 1TAMILMV వెబ్‌సైట్స్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఒక థియేటర్ వేదికగా ఈ పైరసీకి పాల్పడినట్లు తేలింది. పైరసీ కారణంగా 2024లో తెలుగు చిత్ర పరిశ్రమకు 3.7కోట్ల నష్టం ఏర్పడింది. టెలిగ్రామ్‌లో సైతం కొత్త పైరసీ వీడియోలు అప్‌లోడ్‌ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారుగా ఏడాదిన్నర నుంచి హైదరాబాద్‌లోని పలు థియేటర్స్‌లో 40 సినిమాలు రికార్డింగ్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

సినిమా థియేటర్‌లోనే పైరసీ చేసి మాఫియాకి అమ్ముతున్న కిరణ్‌.. ఒక్కొక్క సినిమాకి 400 క్రిప్టో కరెన్సీని తీసుకుంటున్నాడు. క్రిప్టోతో పాటు బిట్‌ కాయిన్స్‌ రూపంలో కూడా డబ్బులు తీసుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన కన్నప్ప, పెళ్లికాని ప్రసాదు, గేమ్‌ ఛేంజర్‌, సినిమాల ఫైల్స్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడు కిరణ్ నుంచి రెండు మొబైల్స్‌ను సీజ్‌ చేశారు.

హైదరాబాద్ లో సినిమా పైరసీ రాకెట్ గుట్టురట్టు


 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)