Breaking News

రాజాసింగ్‌ రీ ఎంట్రీకి ప్రయత్నిస్తున్నారా..?

Published on Wed, 07/30/2025 - 08:56

సాక్షి, హైదరాబాద్‌: గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తిరిగి కమలం గూటికి చేరడానికి ప్రయత్నిస్తున్నారా? బీజేపీ జాతీయ నాయకత్వం ఆహా్వనిస్తే కలవడానికి సిద్ధమవుతున్నారా.. అంటే ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించి బహిష్కరణ వేటుకు గురైన రాజాసింగ్‌ మళ్లీ కాషాయతీర్థం పుచ్చుకునే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 

హైకమాండ్‌ పిలిస్తే రాజీనామా చేయడానికి గల కారణాలు, రాష్ట్ర పార్టీ నాయకుల తీరు గురించి వివరించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ రాజాసింగ్‌ ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ‘నా వైపు నుంచి కూడా కొన్ని తప్పులు దొర్లాయి. అధిష్టానానికి కొందరు నాపై తప్పుడు సమాచారం చేరవేశారు’అని తాజాగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన మనసు మార్చుకునేందుకు, తిరిగి బీజేపీ గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.  

పార్టీకి మాత్రమే రాజీనామా చేశా.. 
‘ఉప ఎన్నిక వస్తుందని కొంత మంది పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. నేను పార్టీకి మాత్రమే రాజీనామా చేశాను. ఎమ్మెల్యే పదవికి కాదు. స్పీకర్‌కు లేఖ ఇవ్వలేదు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరితే అక్కడెక్కడా ఉప ఎన్నిక రాలేదు. గోషామహల్‌లో ఎలా వస్తుందో నాకు తెలియడంలేదు. మరో మూడేళ్లు నేనే ఎమ్మెల్యేగా ఉంటాను. ఉప ఎన్నిక ప్రసక్తే రాదు’అని రాజాసింగ్‌ స్పష్టం చేశారు. 

పార్టీలో మిత్రులతోపాటు శత్రువులు ఉన్నారని, వాళ్లే మీడియాకు లీకులిస్తూ, వాటిని ఢిల్లీలో ఫిర్యాదు చేస్తారని, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తనకు ఫోన్‌ చేశారంటూ సామాజిక మాద్యమాల్లో జరిగిన తప్పుడు ప్రచారంతో నా రాజీనామాను అధిష్టానం ఆమోదించిందని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో రాజీనామా ఇచ్చాననేది వివరణ ఇచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీకి ఎవరి వల్ల నష్టం జరుగుతుంది, ఇతర పారీ్టల నుంచి వచి్చన వారికి ఎలాంటి అవమానాలు జరుగుతున్నాయనే అంశాలను వివరిస్తానని రాజాసింగ్‌ పేర్కొన్నారు.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)