Breaking News

అందాల నారీమణులతో ‘శారీ’గమలు

Published on Wed, 05/14/2025 - 18:26

సాక్షి, యాదాద్రి: చేనేత వస్త్రాలను ప్రపంచ స్థాయికి పరిచయం చేయడమే ప్రథమ లక్ష్యంగా.. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనే అందగత్తెల ముందు ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. మిస్‌ వరల్డ్‌ పోటీలకు వచ్చే అందగత్తెలు ఈ నెల 15న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లికి రానున్నారు. పోచంపల్లిలోని రూరల్‌ టూరిజం రిసార్టుకు ప్రపంచ సుందరీమణులు 25 మంది రానున్నారు. వీరి రాక సందర్భంగా ఇక్కడి ఇక్కత్‌ చీరల ప్రాధాన్యాన్ని వారికి తెలియజేస్తారు.

ఇందువల్ల స్థానిక చేనేత కళాకారులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో చేనేత ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగి ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందిన పోచంపల్లిని ప్రపంచ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నమిది. ఈ సందర్భంగా యాదగిరిగుట్టకు కూడా సుందరీమణులు రానున్నారు. కొండపైన స్వామి వారి దర్శనం అనంతరం.. కొండ కింద ఫొటో సెషన్‌ ఉంటుంది.

చేనేత కళాకారులతో మాటామంతీ
మిస్‌ వరల్డ్‌ పోటీదారులు (Miss World 2025 contestants) స్థానికంగా చేనేత కళాకారులతో ముచ్చటిస్తారు. చీరల తయారీకి వాడే దారం పుట్టుక నుంచి.. వస్త్రం తయారీ వరకు.. పలు అంచెల్లో వస్త్రాల తయారీని ఎలా రూపొందిస్తారో వారు అడిగి తెలుసుకుంటారు.

యాంఫీ థియేటర్‌లో ప్రదర్శన
పోచంపల్లిలోని టూరిజం సెంటర్‌ యాంఫీ థియే టర్‌లో విభిన్నమైన చేనేత వస్త్రాల ప్రదర్శన ఉంటుంది. చేనేత ఇక్కత్, డబుల్‌ ఇక్కత్, తేలియా రుమాల్‌.. ఇలా పలు రకాల వస్త్రాల ప్రదర్శన ద్వారా సంప్ర దాయ, ఆధునికత కలిసిన నూతన ప్యాషన్‌ వస్త్రాలను ప్రదర్శిస్తారు. దీనిద్వారా సంప్రదాయం, ఆధునికత కలిసి నూతన ప్యాషన్‌ అనే మాటకు చిరునామా కాబోతున్నాయి. ఇందువల్ల దేశ విదేశాల యువతలో చేనేతకు గౌరవం లభిస్తుంది. ప్రముఖులు ఇప్పటికే పొచంపల్లి వస్త్రాలను ధరించడం ప్యాషన్‌గా మారింది.  

స్టాళ్లలో ప్రదర్శనలు 
పూర్తిగా గ్రామీణ వాతావరణం కల్పించేందుకు టూరిజం పార్క్‌ను సిద్ధం చేశారు. సిద్దిపేట గొల్లభామ చీరలు, నారాయణపేట, గద్వాల చీరలు, పోచంపల్లి, పుట్టపాక, సిరిపురాలలో తయారయ్యే వస్త్రాలను ప్రదర్శిస్తారు. వీటిని స్థానిక మహిళలు ధరిస్తారు. సంప్రదాయంగా వచ్చిన వస్త్రాలను ఆధునిక ప్యాషన్‌ డిజైనర్‌లతో కొత్త రకంగా వస్త్రాలను రూపొందించి అందగత్తెల ముందు ప్రదర్శిస్తారు. ఇక్కత్‌ డిజైన్లతో తయారవుతున్న తేలియా రుమాల్, సిల్క్, కాటన్, చీరలు, డ్రెస్‌ మెటీరియల్స్, బెడ్‌షీట్స్, రజయ్‌ (క్విల్స్‌), స్టోల్స్, స్కాప్స్, దుప్పట్టా, డోర్, టేబుల్‌ కర్టన్స్, పిల్లో కవర్స్‌ తదితర వెరైటీలను ప్రదర్శించనున్నారు. 

చ‌ద‌వండి: స‌రస‌ర్వ‌తి న‌ది పుష్క‌రాల‌కు నీళ్లు వ‌చ్చాయి

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)