Breaking News

మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు

Published on Sat, 10/04/2025 - 08:22

మేడ్చల్ జిల్లా: మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు.. నీకు కూడా తెలుసు ఆ శ్రీను గాడు.. వాళ్ల అమ్మ, నాన్నలు.. మనకు మనశాంతి లేకుండా చేస్తున్నారు.. రోజూ ఇంటి వద్ద జరిగే గొడవ భరించలేకపోతున్నా.. అంటూ ఓ మైనర్‌ బాలిక సూసైడ్‌నెట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. 

ఈ ఘటన పేట్‌బషిరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు..  కొంపల్లి పోచమ్మగడ్డకు చెందిన అనూరాధకు ఇద్దరు ఆడపిల్లలు. కాగా ప్రైవేట్‌ ఫైనాన్స్‌లో అప్పు తీసుకున్న ఆమె భర్త వారి వేధింపులు భరించలేక చనిపోయాడు.  అనూరాథ  ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తండ్రి చేసిన అప్పులతో ఫైవ్‌ స్టార్‌ ఫైనాన్స్‌ సిబ్బంది బకాయి చెల్లించాలని ఇటీవల వేధింపులకు గురి చేస్తూ వస్తున్నారు. 

ఈ క్రమంలో అనురాధ బావ శ్రీను ఎలాగైనా అనురాధ, ఇద్దరు కుమార్తెలను  కుటుంబాన్ని ఇంటి నుండి గెంటేయాలని కొద్ది రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దసరా పండుగ రోజు అనూరాధ ఇంట్లోని లేని సమయంలో వచి్చన శ్రీను తనకు రావల్సిన డబ్బులు ఇవ్వాలని గొడవ చేశాడు. అవమానకరంగా మాట్లాడటంతో మానసికంగా కుంగిపోయిన మైనర్‌ బాలిక ఇంట్లోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణమైన శ్రీను ను కఠినంగా శిక్షించాలని సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)