సింగరేణి కార్మికులకు శుభవార్త.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Published on Tue, 07/14/2026 - 10:48

సాక్షి, భూపాలపల్లి: తెలంగాణలో సింగరేణి సంస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ తీవ్రంగా దెబ్బతీశాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణిని కేసీఆర్ కుటుంబం తమ జేబు సంస్థగా మార్చుకుని ఇష్టారాజ్యంగా దోపిడీ చేసిందన్నారు. ఇదే సమయంలో సింగరేణి కార్మికులపై ఆదాయపు పన్ను భారం తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.

భూపాలపల్లిలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘సింగరేణి కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సంస్థ ప్రస్తుతం కష్టనష్టాల్లో ఉంది. కేసీఆర్ పాలన వల్ల సింగరేణి 15 సంవత్సరాలు వెనుకబడింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు.  దేశంలో ఎక్కడా లేని సమస్యలు సింగరేణిలో ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఒక్కరోజైనా సింగరేణి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించరా?. సింగరేణిని కేసీఆర్ కుటుంబం తమ జేబు సంస్థగా మార్చుకున్నారు. ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో వ్యవహరిస్తోంంది. వాళ్ల తాత జాగీరు అన్నట్లు గత ప్రభుత్వం, తాజా ప్రభుత్వం వ్యవహరిస్తున్నాయి.

బొగ్గు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, బొగ్గు లేకపోతే దేశం ఒక్కరోజు కూడా ముందుకు సాగదు. కేసీఆర్ హయాంలో జెన్‌కోకు రూ.8,958 కోట్ల అప్పు ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ రెండున్నరేళ్లలో మరో రూ.26,875 కోట్ల అప్పు చేసింది. అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని బెదిరించే ధోరణిలో వ్యవహరిస్తోందని విమర్శించారు.

కర్ణాటకకు నాణ్యమైన బొగ్గు సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడిందని, ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌లో సుమారు 434 మిలియన్ టన్నుల గ్రేడ్-8 నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని, దీనివల్ల సింగరేణికి రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ వచ్చే అవకాశముందని తెలిపారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో కాంగ్రెస్ మంత్రులే రెండు వర్గాలుగా విడిపోయి వాటాల కోసం గొడవపడ్డారని ఆరోపించారు. యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం కోసం సింగరేణి నుంచి రూ.500 కోట్లు తీసుకున్నారని, మెస్సీ ఫుట్‌బాల్ కార్యక్రమానికి కూడా సింగరేణి నిధులను వినియోగించారని విమర్శించారు.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)