Breaking News

Land Cruiser: రూ.3కోట్ల కారు.. ఊడిపోయిన టైరు

Published on Mon, 06/30/2025 - 08:44

కోరుట్ల: ఆ కారు ఖరీదు ఇంచుమించు రూ.3 కోట్లు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నట్లు పేరున్న కారు. ఏదైనా ప్రమాదం జరిగి.. కారు పల్టీలు కొట్టినా పది ఏయిర్‌ బ్యాగులు తెరుచుకుని భద్రత విషయంలో ఏ మాత్రం బెదిరిపోవాసిన అవసరం లేదన్న ప్రచారం ఉంది. దీనికితోడు బులెట్‌ ప్రూఫ్‌. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఖరీదైన కారు టైరు చిన్నపాటి ప్రమాదంలో ఎలా ఊడిపోయిందని స్థానికంగా చర్చ నడుస్తోంది. కారులో ఉన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు అదృష్టవశాత్తు ప్రమాదం జరగలేదు. అదే సమయంలో రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన కారు భద్రతపై మాత్రం లెక్కలేని సందేహాలు వస్తున్నాయి.

అసలేం జరిగింది..?
శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మంత్రి అడ్లూరి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి  కోరుట్ల వచ్చారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో మెట్‌పల్లి నుంచి తిరిగి ధర్మపురి వెళ్లేందుకు తన కారులో బయలుదేరారు. 15 నిమిషాల్లో కారు మెట్‌పల్లిదాటి మారుతీనగర్‌ సమీపానికి చేరుకుంది. అదే సమయంలో దెబ్బతిన్న ఓ కారును కోరుట్లలోని మెకానిక్‌ షెడ్‌ నుంచి నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లికి తీసుకువెళ్తున్న టోచన్‌ వాహనం ఎదురుగా వచ్చింది. రెండు వాహనాలు ఎదురెదురుగా చిన్నగా తగిలినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అకస్మాత్తుగా మంత్రి కారు టైర్‌ ఊడిపోయింది. కారు టైర్‌ ఊడిపోవడం మినహా మంత్రి కారుకు ఎక్కడా ఎలాంటి గీత పడకపోవడం గమనార్హం. ఈ ప్రమాదంలో మంత్రి అడ్లూరి క్షేమంగా బయటపడగా.. టోచన్‌ వాహనంతో కారును తెస్తున్న వారిలో ఇమ్రాన్‌ అనే వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. వెంటనే మెట్‌పల్లి పోలీసులు వచ్చి రెండు వాహనాలను అక్కడి నుంచి తరలించి కేసు నమోదు చేశారు. 

భద్రత సంగతి దేవుడెరుగు..
మంత్రి కారులో ఉన్న ఆధునిక టెక్నాలజీ ప్రకారం ఏ పరికరంలోనైనా విడిభాగాలను బిగించే చిన్న చిన్న నట్లు, స్క్రూలు, ఇతరత్రా పరికరాల్లో కొంచెం తేడా వచ్చినా.. లూజు అయినట్లు ఉన్నా ప్రమాద సూచికలు ఇస్తుందని సమాచారం. శనివారం రాత్రి జరిగిన చిన్నపాటి ప్రమాదానికే ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌ ఆటోమేటిక్‌ టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టం ఉన్న మంత్రి కారు టైరు ఎలా ఊడిపోయిందన్న అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ కారు టైర్‌ ముందుగానే కాస్త లూజ్‌ అయి ఉంటే దానికి సంబంధించిన ప్రమాద సూచికలు ఎందుకు రాలేదన్న సందేహాలు ఉన్నాయి. ఒకవేళ ప్రమాద సంకేతాలు వచ్చినా డ్రైవర్‌ సరిగా దృష్టి పెట్టలేదా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముందస్తుగా ప్రమాదాన్ని నివారించే టెక్నాలజీ వ్యవస్థ సైతం ఈ కారులో ఉంది. అంతే కాకుండా ఈ వాహనం భద్రతా రేటింగ్‌ 5 స్టార్‌ కావడం గమనార్హం.

అవే కార్లు...
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మంత్రుల కోసం ఇదే రకం 22 కార్లను కొనుగోలు చేసిన విషయం తెలి సిందే. కొత్త ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఖజానా లో టు ఉన్నా ఇంత లగ్జరీ కార్లు ఎలా కొనుగోలు చేశారన్న విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం అవే కార్లు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రులకు కేటాయిస్తున్నారు. శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు కేటా యించిన కారు కూడా అదే కావడం గమనార్హం.  

 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)