Breaking News

మూసీ ముంచేసింది..

Published on Sat, 09/27/2025 - 05:36

సాక్షి, హైదరాబాద్‌: మూసీ నది హైదరాబాద్‌ను శుక్రవారం రాత్రి అతలాకుతలం చేసింది. నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగిపోవటంతో నదికి ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. ఎన్నడూ లేనివిధంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ను కూడా వరద ముంచెత్తి్తంది. ఒక్కసారిగా వరదనీరు బస్‌ స్టేషన్‌లోకి చొచ్చుకురావటంతో ప్రయాణి కులు భయభ్రాంతులకు గురయ్యారు. బస్‌ స్టేషన్‌లోని ప్రయాణికులను హైడ్రా, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బయటకు తరలించారు. ముందుజాగ్రతగా మూసీ నదిపై (Musi River Floods) ఉన్న లోలెవలె వంతెనలన్నీ మూసివేశారు. పురాణాపూల్, చాదర్‌ఘాట్, మూసారంబాగ్‌ కాజ్‌వేలను మూసివేస్తూ ట్రాఫిక్‌ పోలీసు చీఫ్‌ జోయల్‌ డెవిస్‌ శుక్రవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. 

ఎంజీబీఎస్‌ నుంచి ప్రయాణికులను తరలిస్తున్న దృశ్యం

రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసీనదికి భారీ వరద పోటెత్తింది. దీంతో శుక్రవారం రాత్రి అధికారులు హిమాయత్‌ సాగర్, ఉస్మాన్‌ సాగర్‌ గేట్లను ముందస్తు హెచ్చరిక చేయకుండానే ఎత్తివేశా రు. దీంతో దిగువన ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగిపోయింది. వెంటనే స్పందించిన హైడ్రా, ఎస్‌డీఆర్‌ఎస్‌ విభాగాలు.. మూసీ వెంట ఉన్న కాలనీల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారులు, పోలీసులు మూసీ పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

కాగా, 1908లో కూడా సెప్టెంబర్‌ 26నే మూసీ నదికి వరదలు వచ్చాయి. అప్పుడు వచ్చిన వరదలకు వేలాది మంది ప్రాణా లు కోల్పోగా, దాదాపు 20వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో హైదరాబాద్‌ నగరాన్ని వరదల నుంచి రక్షించడానికి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ జలాశయాలను నిర్మించారు. మళ్లీ ఇప్పుడు సెపె్టంబర్‌26నే మూసీ వరద ముంచెత్తడంతో నాటి సంఘటనలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)