మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
Hyderabad: స్వప్నతో పరిచయం.. భార్యను పట్టించుకోకుండా..
Published on Fri, 01/06/2023 - 14:29
సాక్షి, హైదరాబాద్: భర్త వేధింపులు తాళలేక మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గురువారం చోటు చేసుకుంది. సీఐ చంద్రశేఖర్ వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా దర్పనపల్లి మండలం దమ్మన్నపేట్ తండాకు చెందిన మాలోత్ మంజుల(24)ను సిరిసిల్లా జిల్లాకు చెందిన మాలోత్ ప్రసాద్‌తో 2021 జనవరి 8న వివాహం జరిగింది.
పెళ్లిలో రూ.10లక్షల నగదు, ప్లాట్, 8 తులాల బంగారాన్ని కట్నంగా అందజేశారు. ఉపాధి కోసం హకీంపేట్‌కు వలస వచ్చిన ప్రసాద్, అతడి భార్య, 15 నెలల కుమారుడితో కలిసి జీవిస్తున్నారు. గత కొంత కాలంగా ప్రసాద్‌కు స్వప్ప అనే మహిళతో పరిచయం ఏర్పడింది. భార్య, కుమారున్ని పట్టించుకోకుండా ప్రసాద్ తిరుగుతున్నాడు.
కుల పెద్దలకు ఫిర్యాదు చేసినా ప్రసాద్ ప్రవర్తనలో మార్పు రాలేదు. అంతేకాకుండా మంజులను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన మంజుల ఇంట్లో ఫ్యాన్ రాడ్డుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీకి తరలించి మంజుల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
చదవండి: (పవన్ కల్యాణ్ ఇంటి ఎదుట మహిళ హంగామా)
Tags : 1