Breaking News

సీఎం కేసీఆర్‌ కొత్త కాన్వాయ్‌కు ‘ఏపీ బుల్లెట్‌ ప్రూఫ్‌’ వాహనాలు

Published on Sun, 07/24/2022 - 08:26

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు భద్రతా చర్యల్లో భాగంగా నూతన వాహన శ్రేణిని ఏర్పాటు చేసేందుకు ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో నూతన వాహన శ్రేణికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

ఈ మేరకు 8 తెలుపు రంగు టయోటా ల్యాండ్‌ క్రూజర్ల వాహనశ్రేణిని బుల్లెట్‌ ప్రూఫ్‌తో సిద్ధం చేసేందుకు విజయవాడ సమీపంలోని వీరపనేని గూడెంలో ఉన్న సంబంధిత సంస్థ తయారీ కేంద్రానికి తరలించినట్లు తెలిసింది. అలాగే రెండు బస్సులను సైతం బుల్లెట్‌ ప్రూఫ్‌తో సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ వాహనాలన్నింటినీ రెండు రోజుల కిందట ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు తరలించి అక్కడి నుంచి వీరపనేని గూడానికి చేర్చినట్లు తెలుస్తోంది. గతంలో వాహనాలకు బుల్లెట్‌ప్రూఫ్‌ తయారీ ఏర్పాట్లకు సంబంధించి దేశంలోని పోలీస్‌ శాఖలన్నీ జార్ఖండ్‌కు తరలించి అక్కడ తయారు చేయించేవి.


( ఫైల్‌ ఫోటో )

అయితే సంబంధిత కంపెనీ ఏపీలో వీరపనేని గూడెంలో ప్రత్యేక యూనిట్‌ ఏర్పాటు చేయడంతో ఈ ప్రక్రియ సులభతరమైనట్లు తెలిసింది. దీనివల్ల ఏపీతోపాటు తమిళనాడు, కేరళ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన వీవీఐపీలకు ఏపీలోనే బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలు తయారుచేసి ఇస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా తెలిసింది. మరో వారంలో సీఎం కేసీఆర్‌కు నూతన బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనశ్రేణి అందుబాటులోకి వస్తుందని నిఘా వర్గాలు వెల్లడించాయి.

ఇది కూడా చదవం‍డి: తండ్రీకొడుకులు స్వేచ్ఛగా తిరగలేరిక!

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)