Breaking News

పదేళ్లు దోపిడీ చేసినందుకు ఓటు వేయాలా?

Published on Mon, 02/09/2026 - 03:11

వైరా/మధిర: ‘మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాల­ని బీఆర్‌ఎస్‌ నాయకులు అడుగుతున్నారు.. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్నందుకు వారికి ఓట్లేయాలా. రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచినందుకు ఓట్లేయాలా’అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా వైరా, మధిర మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో భట్టి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలన కాలంలో పేదలకు ఒక్క ఇల్లు కానీ, ఇంటి స్థలం కానీ ఇవ్వలేదని ఆరోపించారు. 

గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా.. మళ్లీ ఇప్పుడు తాము వచ్చాకే మొదటి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి రూ.22,500 కోట్ల నిధులు వె చ్చిస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనలో పేదలు రేషన్‌ కార్డుల కోసం తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగితే పట్టించుకోలేదన్నారు. అప్పుడు ఇచ్చిన దొడ్డు బియ్యం పేదలకు ఉపయోగపడలేదని చెప్పారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని 1.05 కోట్ల కుటుంబాలకు గాను 1.02 కోట్ల కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. 

అంతేకాక ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడంతో పాటు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా రూ.27 వేల కోట్ల వడ్డీలేని రుణాలు పంపిణీ చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, రాష్ట్ర హస్తకళల సంస్థ చైర్మన్‌ నాయుడు సత్యం, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)