Breaking News

కేసీఆర్‌కు నోటీసులు ఎందుకిచ్చారు?

Published on Sun, 06/01/2025 - 03:09

బంజారాహిల్స్‌: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఎందుకిచ్చారు? కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను సస్యశ్యామలం చేసినందుకా? అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.14లో శనివారం ప్రారంభించిన అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘గోదావరిలో 200 టీఎంసీల నీటి హక్కు తెలంగాణకు ఉండాలని కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని తెలిపారు. 

ఏటా 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినందుకు కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారా? రైతు బీమా, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టినందుకు నోటీసులు ఇచ్చారా ? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీసులు ఇచ్చారా? అది కాళేశ్వరం కమిషనా? కాంగ్రెస్‌ కమిషనా?’అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు జారీచేయడాన్ని నిరసిస్తూ జూన్‌ 4న ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా చేయనున్నట్లు ప్రకటించారు. 

తెలంగాణ సోయితో కేసీఆర్‌ పరిపాలన చేశారని, సీఎం రేవంత్‌రెడ్డి కనీసం జై తెలంగాణ అనకపోవడం మన ఖర్మ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌ రెడ్డి జై తెలంగాణ అనాలని, అమరులకు నివాళులర్పించాలని డిమాండ్‌ చేశారు. జై తెలంగాణ అననివారికి, అమర వీరులకు నివాళులులర్పించని వారికి సీఎం కుర్చీలో కూర్చొనే అర్హత లేదని అన్నారు. రాజీవ్‌ యువ వికాసం పథకం పేరు మార్చి అమరులు శ్రీకాంతాచారి, యాది రెడ్డి, కాళోజీ, పీవీ నరసింహారావులలో ఎవరిదో ఒకరి పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు. 

బనకచర్లపై రేవంత్‌రెడ్డి ఎందుకు మాట్లాడరు?
ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ నీటిని తరలించుకుపోయే ప్రణాళిక వేస్తుంటే సీఎం రేవంత్‌ కనీసం స్పందించడం లేదని కవిత విమర్శించారు. జూన్‌ 2న సీఎం ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీ బిల్లును డీప్‌ఫ్రిడ్జ్‌లో పెట్టే ప్రయత్నం చేస్తే బీజేపీకి సెగ తాకే విధంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. 

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేవరకు పోరాటం చేస్తా మన్నారు. జాగృతిలో ముస్లిం, సిక్కు, క్రిస్టియన్‌ విభా గాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ విభా గాన్ని ఏర్పాటుచేసి ఆ వర్గాల కోసం ఉద్యమిస్తామని వెల్ల డించారు. కేసీఆర్‌కు ఒక కన్ను బీఆర్‌ఎస్‌ అయితే.. మరో కన్ను తెలంగాణ జాగృతి అని పేర్కొన్నారు.   

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు