Breaking News

పోతే రూ.6వేలు.. వస్తే రూ.18 లక్షల ఇల్లు

Published on Sun, 01/18/2026 - 09:22

నిజామాబాద్ జిల్లా: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఇటీవల తగ్గిపోవడంతో కొందరు తమ స్థిరాస్తిని విక్రయించేందుకు నయా ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. మోర్తాడ్‌కు చెందిన ఓ వ్యక్తి రూ. 18 లక్షలు విలువ చేసే 110 గజాల తన ఇంటిని కేవలం రూ. ఆరు వేలకే లక్కీ డ్రాలో పొందవచ్చంటు కరపత్రాల ద్వారా ప్రచా రం చేస్తున్నాడు. 300 మందికి సభ్యత్వం కల్పిస్తూ రూ.18లక్షలు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. 

మహాశివరాత్రి రోజున నిర్వహించే లక్కీ డ్రాలో బంపర్‌ ప్రైజ్‌గా రూ.18లక్షల విలువ చేసే ఇంటిని, 30 మందికి గృహోపకరణాలను బహుమతిగా ప్రకటించారు. ఇలా ఎంతో మంది తమ పాత కార్లు, ఇంటి స్థలాలను, ఇతర సామగ్రిని మార్కెట్‌లో విక్రయించుకోలే లక్కీ డ్రా ద్వారా మార్కెటింగ్‌ చేసుకునే పద్ధతిని ఎంచుకుంటున్నారు. లక్కీ డ్రా నిర్వహణపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నా కొందరు ఇలాంటి ప్రయత్నాలను మానడం లేదు.

కఠిన చర్యలు తీసుకుంటాం
ఎవరైనా ప్రభుత్వ అనుమతి లేకుండా లక్కీడ్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మోర్తాడ్‌లో లక్కీడ్రా విషయం మా దృష్టికి వచ్చింది. సదరు వ్యక్తిని హెచ్చరించాం. ప్రజలు లక్కీడ్రాలను నమ్మి మోసపోవద్దు. 
– రాము, ఎస్సై, మోర్తాడ్‌

 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)