Breaking News

హైడ్రా ఒక వేట కుక్క

Published on Wed, 07/29/2026 - 05:41

సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హైడ్రా ఒక వేట కుక్కలా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు ధ్వజమెత్తారు. ఆ వేట కుక్కను పంపించి, దానిని అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హైడ్రా ద్వారా బడా బాబులను బెదిరించి డబ్బులు దండుకుంటున్నారని, ఆ డబ్బులో కొంత వాటా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాం«దీకి, మరికొంత వాటా బీజేపీకి ఇస్తున్నారని ఆరోపించారు. ‘హైడ్రా అనేది తొమ్మిది తలల విషసర్పం అని హైకోర్టే చెప్పింది.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంతకంటే చెంపపెట్టు ఏముంటుంది? సీఎంకు సిగ్గుండాలి..’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘హైడ్రా అనేది నువ్వు చెప్పినట్టు సంస్కరణ అయితే, మీ అన్న తిరుపతిరెడ్డి ఇల్లు, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత కేవీపీ రామచంద్రరావుల ఇళ్లు ఎందుకు కూల్చడం లేదు?..’అని నిలదీశారు. కేటీఆర్‌ మంగళవారం ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఫ్లోర్‌ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీ దామోదరరావులతో కలసి రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఎంపీ వద్దిరాజు నివాసంలో అందరితో కలిసి మీడియాతో మాట్లాడారు.  

నీ అన్నదమ్ములే అతిపెద్ద కబ్జాకోరులు 
‘హైడ్రాపై 65 సార్లు హైకోర్టు చెప్పినా వినవా? ఇంకా ఎవరు చెప్తే వింటావ్‌? నేనే రాజు, నేనే మంత్రి, నేను హిట్లర్‌ అనుకొని, హిట్లర్‌కు ఇష్టమైన పదం ‘‘హైడ్రా’’ఐ డిమాలిíÙంగ్‌ ఎవ్రీథింగ్, ఇరాన్, ఇజ్రాయెల్‌ మాదిరిగానే ఉంటాను అంటావా? హైదరాబాద్‌ను శిథిలావస్థలోకి తీసుకునిపోతావా?ఇదేనా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? మమ్మల్ని కబ్జాకోరులు అని అంటున్నావ్‌. మేం కాదు ..నీ అన్నదమ్ములే అతిపెద్ద కబ్జాకోరులు. అందరికంటే ఎక్కువ ఆస్తి దోచుకుంటున్నది, అందరికంటే ఎక్కువగా ఇవాళ విధ్వంసం చేస్తున్నది నీ మంత్రులే.

హైకోర్టు చెప్పి 24 గంటలైనా ఇంకా రంగనాథ్‌ను కొనసాగించొచ్చా? మా హయాంలో ఉన్న ‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌’(ఈవీడీఎం) పేరు మార్చి, అన్నిటికీ రంగులేసినట్టు, సున్నాలేసినట్టు దీనికి కూడా వేసి పోజులు కొట్టడం తప్ప పీకిందేమీ లేదు. కేవలం దాన్ని అడ్డుపెట్టుకుని రేవంత్‌రెడ్డి అతిపెద్ద బ్లాక్‌ మెయిలర్‌గా మారారు. వాస్తవానికి అధికారంలోకి రాకముందే పెద్ద బ్లాక్‌ మెయిలర్‌. ఆర్టీఐని అడ్డం పెట్టుకొని బతికినోడు. ఇప్పుడు హైడ్రాని అడ్డం పెట్టుకొని బతుకుతున్నాడు..’అంటూ కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  

మీ రహస్య మిత్రులు బీజేపీ వాళ్లే.. 
రేవంత్‌ ఢిల్లీలో ఉన్నప్పుడే కేటీఆర్‌ కూడా ఉంటున్నారంటూ బీజేపీ ఎంపీ «ధర్మపురి అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఆ­గ్రహం వ్యక్తం చేశారు. ‘రేవంత్‌రెడ్డి కేసులు పెట్టేది మా మీద. తెల్లారి లేస్తే దాడి చేసేది మా మీద. రేవంత్‌రెడ్డి రహస్య మిత్రు­లు బీజేపీ వాళ్లని రాష్ట్రంలో అందరికీ తెలుసు. కేంద్రమంత్రి బండి సంజయ్‌ కొడుకుని 9 రోజులు అరెస్టు చేయకుండా కా­పాడింది రేవంత్‌రెడ్డే అనే విషయం అందరికీ తెలుసు. అమృత్‌ పథకంలో రేవంత్‌రెడ్డి బావమరిదికి కాంట్రాక్టులు ఇచ్చింది ఎ­వరో అందరికీ తెలుసు. సింగరేణిలో కుంభకోణం జరుగుతుంటే, అక్కడ సృజన్‌రెడ్డి నాయకత్వంలో, రేవంత్‌రెడ్డి బావమరిది నాయకత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతుంటే, మేము వచ్చి ఇక్కడ ఫిర్యాదు చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదని అందరికీ తెలుసు..’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.  

2014లో కూడా బకాయిలున్నాయి.. 
‘మేము అధికారంలోకి వచి్చనప్పుడు 2014లో కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.4 వేల కోట్లు ఉన్నాయి. వాటిని మేం చెల్లించలేదా? బకాయిలు అనేది నిరంతర ప్రక్రియ..’అని కేటీఆర్‌ వివరణ ఇచ్చారు. ‘చెల్లని నాణేనికి గీతలు ఎక్కువ, చేతగానోడికి మాటలు ఎక్కువ..’అంటూ ఎద్దేవా చేశా­రు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాల పునరి్వభజన చేపట్టి దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని కేటీఆర్‌ తెలిపారు. ప్రజలకు మరింత చేరువ కా­వాలంటే లోక్‌సభ స్థానాల కంటే దేశవ్యాప్తంగా ఎమ్మెల్యే స్థా­నా­లను పెంచాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చే సంస్కరణలకు బీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తుందని, అయితే కొత్త బిల్లులు తెచ్చేముందు గతంలో నియమించిన కమిటీల సిఫార్సుల అమలుపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  

కాజీపేట రైల్వే డివిజన్, వరంగల్‌లో ఏఐ సెంటర్‌ 
కాజీపేటలో ప్రత్యేక రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరినట్లు కేటీఆర్‌ తెలిపారు. కొత్తగూ­డెం రైల్వే డివిజన్‌ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, సిరిసి­ల్ల, వేములవాడ స్టేషన్లను అమృత్‌ భారత్‌ పథకంలో చేర్చా­లని కోరామన్నారు. వరంగల్‌లో ఇండియా ఏఐ సెంటర్‌ లేదా ఏఐ డేటా ల్యాబ్‌ ఏర్పాటుచేయాలని, కరీంనగర్‌ లేదా ఖమ్మంలో సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్, ఎస్‌టీపీఐ కేంద్రా­లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)