Breaking News

హైకోర్టు ఆదేశాలు.. కేటీఆర్‌ నల్గొండ టూర్‌ రద్దు

Published on Mon, 01/20/2025 - 18:18

సాక్షి, హైదరాబాద్‌ : రేపటి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  కేటీఆర్ నల్గొండ టూర్ రద్దయ్యింది. నల్గొండలో బీఆర్ఎస్ చేపట్టబోయే రైతు మహా ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరించారు. క్లాక్ టవర్ సెంటర్‌లో పార్కింగ్, ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో పోలీసులు అనుమతివ్వలేదు.

అయితే పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్‌ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు.. పోలీసుల అనుమతి విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. 

ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభల నేపథ్యంలో బందోబస్తుపై హైకోర్ట్‌లో వాదనలు నడిచాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈ నెల 26 తర్వాత రద్దీ ప్రాంతంలో కాకుండా అనువైన ప్రాంతంలో బీఆర్‌ఎస్‌ సభ నిర్వహించుకునేందుకు అభ్యంతరం లేదని తెలిపింది. అనంతరం.. బీఆర్ఎస్ నేతల లంచ్ మోషన్ పిటీషన్‌ను 27కు వాయిదా వేసింది. 

రేపటి కేటీఆర్ నల్లగొండ పర్యటన రద్దు

కాంగ్రెస్‌ ప్రభుత్వం.. రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నల్గొండలో బీఆర్‌ఎస్‌ రైతు మహాధర్నా తలపెట్టిన సంగతి తెలిసిందే. పట్టణ కేంద్రంలోని క్లాక్‌ టవర్‌ సెంటర్‌ వద్ద జరుగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి జిల్లా నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. కానీ పోలీసులు.. ధర్నాకు అనుమతి నిరాకరించడంతో బీఆర్‌ఎస్‌ నాయకులు అనుమతి కోసం హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు పోలీసులు తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హైకోర్టు నిర్ణయంతో నల్గొండ పర్యటనపై కేటీఆర్‌ వెనక్కి తగ్గారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)