Breaking News

మోసమే కాంగ్రెస్‌ నైజం

Published on Wed, 09/17/2025 - 04:44

సాక్షి, హైదరాబాద్‌ : ప్రజలను మోసగించడమే కాంగ్రెస్‌ నైజమని, అబద్ధాలతో అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ పాత రోజులను తిరిగి తెచ్చి పాలనా సామర్థ్యం లేక గత ప్రభుత్వంపై నెపం నెడుతోందని విమర్శించారు. పదేళ్లలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయామన్నారు. 

తెలంగాణభవన్‌లో మంగళవారం జరిగిన భద్రాచలం నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు, ఇతర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఈ సమావేశంలో కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు.  

దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలి  
పార్టీ మారిన ఎమ్మెల్యేలు పిరికివాళ్లుగా మారారని, కాంగ్రెస్‌కు దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. మంత్రి పొంగులేటి లక్కీలాటరీలో మంత్రి పదవి దక్కించుకొని అహంకారంతో మాట్లాడుతున్నారు..పాలేరులో ఎలా గెలుస్తారో చూద్దాం అని సవాల్‌ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రల ను ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బలంగా నిలబడుతుందని, కేసీఆర్‌ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.  

రాజ్యాంగంపై బీజేపీకి గౌరవం లేదు 
వక్ఫ్‌ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను తమ పార్టీ స్వాగతించడాన్ని విమర్శిస్తున్న బీజేపీ నేతలకు భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు పట్ల ఏ మాత్రం గౌరవం లేదని కేటీఆర్‌ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం కేటీఆర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. 

పాక్‌ ప్రేరేపిత ఉగ్రదాడిలో చిందిన 26 మంది అమాయకుల నెత్తురు తడి ఇంకా ఆరకముందే ఆ దేశంతో క్రికెట్‌ ఆడేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోవడం ఆ పార్టీ నకిలీ జాతీయవాదం, కపట దేశభక్తికి తిరుగులేని సాక్ష్యంగా పేర్కొన్నారు. హైదరాబాద్‌ నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి దేహాలను మూడు రోజులైనా గుర్తించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని కేటీఆర్‌ విమర్శించారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)