Breaking News

బీఆర్‌ఎస్‌ వచ్చాక.. హైడ్రా బంగాళాఖాతంలోకే.. కేటీఆర్‌

Published on Tue, 07/28/2026 - 17:32

సాక్షి, ఢిల్లీ: హైడ్రాపై  హైకోర్టు  ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్‌కు చెంపపెట్టు లాంటిదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైడ్రా ను అడ్డుపెట్టుకొని రేవంత్ రెడ్డి దందాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ రోజు (మంగళవారం) ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు.హైడ్రా పేరుతో పేదల ఇళ్లను అన్యాయంగా కూలగొట్టారని కేటీఆర్ ధ్వజమెత్తారు. 

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్‌ను కుప్పకూల్చారన్నారు.  హైడ్రా అనేది బ్లాక్ మెయిల్ చేసి దోపిడి చేసే సంస్థని బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే హైడ్రా ను బంగాళాఖాతంలో వేస్తామని స్పష్టం చేశారు. హైడ్రా పేరుతో బిల్డర్లను  భయపెట్టి  ఒక్కో బిల్డర్ వద్ద ఫీట్ కు 200 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు.కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రైల్వే పనులన్నీ స్తంభించిపోయాయని కేటీఆర్‌ ఆరోపించారు.

హైడ్రా అనే సంస్థ తొమ్మిది తలల విషసర్పంలా మారిందని, కేవలం పేదల ఇళ్లపైనే హైడ్రా చర్యలు తీసుకుంటోందని, అధికార పార్టీ నేతలు, మంత్రులు, వారి కుటుంబాలకు చెందిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.రాష్ట్రంలోని నిషేధిత భూముల విస్తీర్ణం బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 16 లక్షల ఎకరాలు ఉండగా, కాంగ్రెస్ హయాంలో అది కోటి ఎకరాలకు చేరిందని తెలిపారు.

భూ వ్యవహారాల్లో అవినీతి, కమిషన్ల కోసం నిషేధిత భూముల జాబితాను పెంచుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలుచేశారు.హైదరాబాద్‌లో వేలాది ఇళ్లను కూల్చివేసి, ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించలేదని దీంతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిందన్నారు. పెద్ద నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా, సామాన్య ప్రజల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు.  

రేవంత్ రెడ్డిసోదరుడు తిరుపతి రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,పట్నం మహేంద్ర రెడ్డి,మంత్రి వివేక్ నివాసాలను ఎందుకు కూల్చడం లేదు.బిల్డర్స్ ను బెదిరించి డబ్బులు వసూల్ చేస్తున్నారని హైడ్రా సంస్థ సీఎం రేవంత్‌కు వేటకుక్కలా మారిందని కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)