Breaking News

అదరగొట్టిన ఆఫ్రికన్‌ చిన్నారులు.. కేటీఆర్‌ మెచ్చిన డ్యాన్స్‌ వీడియో

Published on Fri, 08/26/2022 - 19:40

ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్‌ తప్పక ఉంటుంది. అందుకు కావాల్సిందల్లా మనలోని టాలెంట్‌ను గుర్తించి దానిని పదును పెట్టడమే. చాలామందిలో టన్నుల కొద్దీ టాలెంట్‌ ఉన్నప్పటికీ.. నిరూపించుకునేందుకు సరైన మార్గం లేక వెనకబడిపోతారు. అయితే ఇటీవల కాలంలో సోషల్‌ మీడియా వినియోగం పెరగడంతో మారుమూల ప్రాంతంలోని ప్రతిభ కలిగిన వ్యక్తులు కూడా ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. రాత్రికి రాత్రే పాపులారిటీ సంపాదించి ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.

అచ్చం ఇలాగే ఆఫ్రికన్‌ చిన్నారులు బాలీవుడ్‌ పాటకు అద్భుతంగా డ్యాన్స్‌ చేసి ఔరా అనిపించారు. సిద్ధార్థ్‌ మల్హోత్రా, కత్రినా కైఫ్‌ నటించిన బార్‌ బార్‌ దేఖో సినిమాలో కాలా చష్మా పాటకు ఎనర్జిటిక్‌ స్టెప్పులతో దుమ్ములేపారు. భాష రాకపోయినా, దాదాపు పది మంది ఉన్న పిల్లలు గ్రూప్‌గా ఏర్పడి ఒకరిని మించి ఒకరు పోటాపోటీగా స్టెప్పులేశారు. కష్టమైన మూవ్‌మెంట్స్‌ను కూడా చాలా సునాయసంగా చేస్తూ అందరి మనసులు దోచుకున్నారు. తమ డ్యాన్సింగ్‌ స్కిల్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు.
చదవండి: ఆకాశంలో 175 సార్లు రివవర్స్‌ స్పిన్నింగ్‌.. తన రికార్డును తానే బ్రేక్‌ చేసుకొని

డ్డ్యాన్స్‌ చేస్తున్న పిల్లలు వెనుక బ్యాగ్రౌండ్‌ చూస్తుంటే వారంతా గ్రామీణ నేపథ్యానికి చెందిన వారిలా కనిపిస్తు‍న్నారు. వీరంతా మట్టిలో మాణిక్యం అనే పదానికి సరైన నిర్వచనం ఇచ్చారు. ఏవియేటర్‌ అనిల్‌ చోప్రా చేర్‌ చేసిన ఈ వీడియోపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు కురిపించారు. దీనిని రీట్వీట్‌ చేస్తూ.. పిల్లలు అద్భుతంగా డ్యాన్స్‌ చేశారని, ఇది తప్పకుండా మీ ముఖంలో చిరునవ్వు తీసుకొస్తుందని కామెంట్‌ చేశారు. 

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)