Breaking News

కొండా సురేఖపై కేటీఆర్‌ పరువు నష్టం దావా

Published on Thu, 10/10/2024 - 13:57

సాక్షి,హైదరాబాద్‌: నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఇవాళ (గురువారం)  నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కొండా సురేఖపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ తరఫు న్యాయవాది వినతించారు.

బాల్క సుమన్‌, తుల ఉమ, సత్యవతి రాథోడ్‌, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా కేటీఆర్‌ చేర్చారు. కొండా సురేఖ మాట్లాడిన ఆడియో, వీడియో టేపులను కేటీఆర్‌ న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. 23 రకాల ఆధారాలను అందజేశారు. తదుపరి విచారణ ఈ నెల 14కు కోర్టు వాయిదా వేసింది. 

కాగా, ఇప్పటికే మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హీరో అక్కినేని నాగార్జున పిటిషన్ దాఖలు చేయగా, ఆమెకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కొద్దిరోజుల క్రితం అక్కినేని నాగార్జున కుటుంబం మీద ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.

ఈ క్రమంలో మంత్రి  తమ కుటుంబంపై అమర్యాద పూర్వక వ్యాఖ్యలు చేశారని నాగార్జున కోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా వేశారు. రాజకీయ లబ్ధి కోసమే మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని  సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అయితే, తాజాగా  స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు మంత్రి కొండా సురేఖకు  నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 23న జరగనుంది.
 

 



 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)