సింగరేణి పరిరక్షణే లక్ష్యంగా పోరాటం

Published on Thu, 01/22/2026 - 03:49

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి పరిరక్షణే లక్ష్యంగా పోరాటం కొనసాగుతుందని..అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ బయటపెట్టిన సింగరేణి టెండర్ల కుంభకోణంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి స్పందించిన తీరు పట్ల బుధవారం ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భారీ స్కామ్‌పై విచారణ జరపాలని క్షేత్రస్థాయిలో సింగరేణి కా ర్మికులు మోగించిన జంగ్‌ సైరన్‌ కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే కాకుండా, కేంద్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిక లాంటిదని వ్యాఖ్యానించారు. 

బీఆర్‌ఎస్‌ వెల్లడించిన సింగరేణి టెండర్ల అక్రమాలపై స్పందిస్తూ, ఈ స్కామ్‌లో ప్రధాన దోషిగా ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకొచ్చి సీబీఐ విచారణ కోరితేనే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్న కేంద్ర మంత్రి వాదన దివాలాకోరు విధానానికి నిదర్శనం కాదా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. అక్రమ పద్ధతిలో తన బావమరిదికి టెండర్లు కట్టబెట్టిన సీఎం తానే సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేయాలని ఆశించడం మూర్ఖత్వానికి పరాకాష్ట కాదా అని నిలదీశారు. 

పట్టపగలు దోపిడీ చేసిన దొంగ ఎక్కడైనా స్వయంగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తనపైనే విచారణ జరపాలని కోరతాడా అని ప్రశి్నస్తూ, సింగరేణి స్కామ్‌లో ఇదే తరహా విచిత్రమైన వాదనను కేంద్ర మంత్రి చేయడం ఆశ్చర్యకరమని మండిపడ్డారు. ఇది కేవలం కేంద్రమంత్రి అజ్ఞానమా లేక సీఎం రేవంత్‌రెడ్డితో బీజేపీకి ఉన్న చీకటి ఒప్పందాల ఫలితమా అని కేటీఆర్‌ తీవ్రంగా ప్రశ్నించారు.   

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)