మా హయాంలోనే సింగరేణికి వెలుగు

Published on Tue, 07/14/2026 - 03:44

రుద్రంపూర్‌: దేశ ప్రధానిగా మన్మోహన్‌సింగ్‌ ఉన్నప్పుడు రూ.2.50 లక్షల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక పైసా దారి తప్పకుండా చూస్తూ సింగరేణిని ఆదుకునే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ‘సింగరేణి భరోసా యాత్ర’పేరిట చేపట్టిన యాత్ర మొదటి రోజైన సోమవారం  కొత్తగూడెం, మణుగూరు, భూపాలపల్లి వరకు కొనసాగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే.అరుణ, నాయకులతో కలిసి యాత్రలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పైసలు తీసుకొని బ్లాక్‌లు కేటాయించే విధానం ఉంటే, దీన్ని సుప్రీంకోర్టు తప్పుపడుతూ కొందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. దీంతో బీజేపీ అధికారంలోకి వచ్చాక వేలంలో పాల్గొన్న వారే బ్లాక్‌లు పొందే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు.సింగరేణి సంస్థకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు విద్యుత్, బొగ్గుకు సంబంధించి సుమారు రూ.54 వేల కోట్ల బకాయి ఉండడంతో అభివృద్ధి కుంటు పడిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 

ఈ విషయాన్ని గ్రహించిన కేంద్రం తొలిసారి వేలం లేకుండా తాడిచర్ల–2 బ్లాక్‌ను సంస్థకు కేటాయించిందని తెలిపారు. ప్రజలు, కారి్మకులు బీజేపీ కృషిని గుర్తించి రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ఆదరించాలని కిషన్‌రెడ్డి కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కొమురయ్య, నేతలు కోటేశ్వరరావు, అంజిరెడ్డి, గౌతంరావు, ఆనంద్‌ గౌడ్, బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.  

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)