Breaking News

‘పోతే నా ఒక్కడి ప్రాణం..’ ఖమ్మం రియల్‌ హీరో సాహసం వైరల్‌

Published on Tue, 09/03/2024 - 14:43

ఖమ్మం, సాక్షి: తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం అతలాకుతలం అయింది. మున్నేరుకు పోటెత్తిన వరదతో ఖమ్మం, ఖమ్మం రూరల్‌ మండలాల్లోని పరీవాహక ప్రాంత కాలనీల్లోకి నీరు చేరింది. తెలుగురాష్ట్రాల రాకపోకలకు కేంద్రబిందువుగా ఉన్న ఖమ్మం జిల్లా కేంద్రం ఒక్కరోజు కురిసిన వర్షానికే జలదిగ్భంధం అయిపోయింది. అన్నీ ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచి జనజీవనం స్తంభించిపో​యింది. అయితే..

శనివారం రోజు కురిసిన భారీ వర్షాలకు.. మున్నేరు వరద ప్రమాదకరంగా పొంగిపొర్లింది. భారీ వర్షం, వరద ధాటికి ప్రకాశ్‌నగర్‌ బ్రిడ్జ్‌ మీద నుంచి ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహించింది. అనుకోకుండా.. ఈ బ్రిడ్జి మీద చిక్కుకుపోయిన తొమ్మిది మంది సాయం కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూశారు. ఈ ప్రమాదకర వరదల్లో సుభాన్‌ ఖాన్‌ అనే జేసీబీ డ్రైవర్‌ ప్రదర్శించిన సాహసం.. జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించింది. 

వాళ్లను రక్షించేందుకు సుభాన్‌ ప్రయత్నిస్తుండగా అంతా వారించారు. ‘నేను అక్కడిపోతే నాది ఒక్క ప్రాణం పోవచ్చు. నేను సాహసం చేస్తే తొమ్మిది ప్రాణాలు రక్షించిన వాడిని అవుతాను’ అని జేసీబీతో వెళ్లి వారిని బయటకు తీసుకువచ్చారు. వరద సహాయక కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక బీఆర్‌ఎస్‌ నేతలు, స్థానిక ప్రజలు జేసీబీ డ్రైవర్‌ సుభాన్‌ ఖాన్‌ చేసిన సాహసాన్ని కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానం చేశారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సైతం సుభాన్‌ను ఫొన్‌లో అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన  వీడియోలు, ఆ రియల్‌ హీరో సాహసం నెట్టింట చర్చగా మారింది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి