Breaking News

సుదర్శన్‌రెడ్డికి కేసీఆర్ ప‌రామ‌ర్శ‌

Published on Mon, 07/27/2026 - 16:06

సాక్షి, సికింద్రాబాద్: బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు సోమవారం ప‌రామ‌ర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయ‌న‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని వైద్యులకు సూచించారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను క‌లిసి ధైర్యం చెప్పారు.

కేసీఆర్ అంత‌కుముందు ఎర్ర‌వ‌ల్లి వ్య‌వ‌సాయక్షేత్రం నుంచి సికింద్రాబాద్ వ‌చ్చారు. నేరుగా ఆస్ప‌త్రికి వెళ్లి సుదర్శన్‌రెడ్డిని ప‌రామ‌ర్శించారు. ఆయ‌న వెంట పార్టీ నేత‌లు హ‌రీశ్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్‌, ప‌ల్లా రాజేశ్వ‌ర్‌, సంజ‌య్ కుమార్‌, సంతోష్ కుమార్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, బాల్క సుమ‌న్ త‌దిత‌రులు ఉన్నారు. కేసీఆర్ రాక‌తో ఆస్ప‌త్రికి పెద్ద సంఖ్య‌లో బీఆర్‌ఎస్ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు త‌ర‌లిచ్చారు. 

ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురైన సుదర్శన్‌రెడ్డిని మెరుగైన వైద్యం కోసం హనుమకొండ నుంచి సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. వెంటిలేటర్‌పై ఉంచి ఆయ‌న‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలిసింది.

చ‌ద‌వండి: ఉత్కంఠ రేపుతున్న కార్పొరేషన్ల ఎన్నికలు 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)