Breaking News

మరో 8 మెడికల్‌ కాలేజీలకు నిధులు!

Published on Sun, 09/17/2023 - 00:24

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు లక్ష్యం వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తికానుంది. రెండు రోజుల కిందే తొమ్మిది కొత్త మెడికల్‌ కాలేజీలను సీఎం కేసీఆర్‌ ప్రారంభించగా.. వచ్చే ఏడాది మరో ఎనిమిదింటిని అందుబాటులోకి తేనున్నట్టు ప్రక టించారు. రూ.1,447 కోట్లతో ఈ 8 మెడికల్‌ కాలే జీలకు భవనాలు, హాస్టళ్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం పరి పాలన అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వుల ప్రతిని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టి.హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు ఇక్కడ కేవలం ఐదు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలే ఉండగా.. వచ్చే ఏడాది నాటికి ఏకంగా 34కు పెరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తొమ్మిది కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించుకున్న మరుసటి రోజే మరో ఎనిమిది కాలేజీల ఏర్పాటుకు పరిపాలన అనుమతుల మంజూరు చేసేలా అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

నారాయణపేట్, ములుగు, మెదక్‌లలో ఏర్పాటు చేసే మెడికల్‌ కాలేజీల కోసం రూ. 180 కోట్ల చొప్పున.. గద్వాల, నర్సంపేట, యాదాద్రిలలో కాలేజీలకు రూ.183 కోట్ల చొప్పున, కుత్బుల్లాపూర్‌ కాలేజీకి రూ.182 కోట్లు, మహేశ్వరం కాలేజీకి రూ. 176 కోట్లు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. ఈ మేరకు కాలేజీలు, హాస్టల్‌ భవనాల నిర్మాణాన్ని వేగంగా చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ 8 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి, ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

సీడబ్ల్యూసీ భేటీ పేరుతో కాంగ్రెస్‌ జిమ్మిక్కులు
హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాల పేరుతో కాంగ్రెస్‌ జిమ్మిక్కులకు పాల్పడుతోందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేయడం కుదరదని, రాష్ట్రానికి పర్మనెంట్‌ గ్యారంటీ కేసీఆరేనని చెప్పా రు. ఎవరెన్ని చేసినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)