Breaking News

రెండు కుటుంబాల్లో అలుముకున్న చీకట్లు

Published on Fri, 12/26/2025 - 08:34

ఆ రెండు కుటుంబాల్లో ఒకేసారి చీకట్లు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదం.. వాళ్ల ఏకైక బిడ్డలను బలిగింది. బాల్యమిత్రులైన ఇద్దరు స్నేహితుల జీవిత ప్రయాణం అనూహ్యంగా.. అర్ధాంతరంగా ముగిసిపోయింది. 

సాక్షి, కామారెడ్డి: మాచారెడ్డి మండలం లచ్చాపేట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. జక్కుల సాయికిషోర్‌(21), మిరిదొడ్డి అజయ్‌(21) అనే స్నేహితులు గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరణించిన వారు తమ కుటుంబాలకు ఏకైక కుమారులే. యువకుల తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి చౌరస్తా నుంచి లచ్చాపేటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న వీరిద్దరూ శివారులో రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కొంపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మొదట సాయికిషోర్, తర్వాత కొంతసేపటికి అజయ్‌ మరణించారు.

 ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై అనిల్‌ తెలిపారు. బాధితుల్లో ఒకరి కాలి ఎముక.. ఆ లారీ చక్రానికి తగిలి టైరు పంక్చర్‌ అయ్యిందంటే.. ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు!. అందుకే అతివేగం అత్యంత ప్రమాదం అని చెప్పేది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)