Breaking News

ఇలాంటి టీచ‌ర్‌.. స్కూల్‌కి ఒక్క‌రుంటే చాలు..

Published on Thu, 04/10/2025 - 19:11

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: బడి ముగిశాక ఏ ఉపాధ్యాయుడైనా ఇంటికి వెళ్తారు.. కానీ ఒక ప్రధానోపాధ్యాయుడు పాఠశాల తనది.. పిల్లలను కుటుంబసభ్యుల్లా భావిస్తున్నారు. పాఠశాలలోనే ఉంటూ.. విద్యార్థుల ఇళ్లకు రోజూ వెళ్తూ.. చదువును పర్యవేక్షిస్తూ.. అనుక్షణం వారి ఉన్నతికి కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే కామారెడ్డి జిల్లా (Kamareddy District) బీబీపేట టీఎస్‌ఎన్‌ఆర్‌ జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల గెజిటెడ్‌ హెడ్మాస్టర్‌ మూల రవీంద్రారెడ్డి. 

2023 సెప్టెంబర్‌ 25న వరంగల్‌ జిల్లా (Warangal District) నుంచి బదిలీపై రవీంద్రారెడ్డి వచ్చారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అదే బడిలో నివసిస్తున్నారు. రెండు రోజుల సెలవులు (Holidays) వచ్చినప్పుడే.. సొంతూరు వరంగల్‌కు వెళ్తారు. స్కూళ్లో మొత్తం 610 మంది విద్యార్థులు ఉన్నారు.  

బడిలోనే ఉంటూ..
పాఠశాల నిర్మించిన సమయంలోనే ఉపాధ్యాయుల కోసం పై అంతస్తులో గదులు నిర్మించారు. హెడ్మాస్టర్‌ (Head Master) రవీంద్రారెడ్డి అందులోనే ఉంటున్నారు. ఆయన రోజూ ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పదో తరగతి విద్యార్థుల ఇళ్లకు వెళ్తారు. వారేం చదువుతున్నారో పరిశీలించి.. తల్లిదండ్రులతో మాట్లాడి వస్తారు. పిల్లలు పాఠశాలకు గైర్హాజరైనా, తక్కువ మార్కులు వచ్చినా తల్లిదండ్రులను పిలిచి మాట్లాడతారు.

విద్యార్థులను తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం
కార్పొరేట్‌ విద్యాసంస్థలో లేని సౌకర్యాలన్నీ మా పాఠశాలలో ఉన్నాయి. మంచి ఉపాధ్యాయుల బృందం ఉంది. ఆధునిక పద్ధతుల్లో బోధన సాగిస్తున్నాం. పిల్లలు బాగానే చదువుతున్నారు. ఇంకా మెరుగవ్వాలి. విద్యార్థులను తీర్చిదిద్దడానికి మరింతగా ప్రయత్నిస్తాం. 
– మూల రవీంద్రారెడ్డి, హెడ్మాస్టర్, బీబీపేట, కామారెడ్డి జిల్లా

చ‌దవండి: జ‌గిత్యాల‌కు ఐకాన్ ఈ ఖిల్లా

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)