Breaking News

కేటీఆర్‌ కొడుకు హిమాన్షు పెద్ద మనస్సు.. ప్రశంసల వర్షం

Published on Mon, 07/10/2023 - 19:43

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటాడు. తాజాగా హిమాన్షు మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిని నిరూపించుకున్నాడు. అయితే, ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకుని సుమారు రూ.కోటి వెచ్చించి కార్పొరేట్‌ స్కూల్ తరహాలో తీర్చిదిద్దారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశాడు.

వివరాల ప్రకారం.. హిమాన్షు ఖాజాగూడలోని ఓ ప్రైవేటు కార్పొరేట్‌ పాఠశాలలో చదివే సమయంలో.. ఆ పరిసర ప్రాంత గచ్చిబౌలి కేశవనగర్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించాడు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో షిమాన్షు పలుమార్లు మాట్లాడాడు. ఈ క్రమంలో పేద విద్యార్థులు చదివే ఆ పాఠశాలను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో, పాఠశాలను దత్తత తీసుకున్నాడు. అనంతరం పాఠశాల అభివృద్ధి కోసం సుమారు రూ.80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేసి అత్యాధునికంగా తీర్చిదిద్దాడు. ఈ విషయాలను ఆ స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ రాములు యాదవ్‌ వెల్లడించారు. హిమాన్షు సమకూర్చిన నిధులతో విద్యార్థులకు బెంచీలు, మరుగుదొడ్ల నిర్మాణం, డైనింగ్ గది, ఆట స్థలాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

ఈ దీనికి సంబంధించిన వివరాలను హిమాన్షు ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశారు. ఇదిలా ఉండగా.. హిమాన్షు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 12న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ పాఠశాలను ప్రారంభించనున్నారు. దీంతో, ఈ విషయంపై నెటిజన్లు స్పందిస్తూ హిమాన్షును ప్రశంసిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: వైభవంగా ఉజ్జయినీ మహంకాళి బోనాలు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)