Breaking News

అందుకే ప్రెస్‌ మీట్‌ నిర్వహించా: జస్టిస్‌ నరసింహారెడ్డి

Published on Tue, 07/16/2024 - 18:50

ఢిల్లీ, సాక్షి: విచారణ కమిషన్లు వేసేదే  ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని, అలాంటిది తనపై అబద్ధాలు ప్రచారం చేశారని జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే పవర్‌ కమిషన్‌ చైర్మన్‌ తప్పుకున్నట్లు చెప్పిన ఆయన.. సాక్షితో మాట్లాడారు.

విచారణ కమిషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నాక కొన్ని ఊహాగానాలకు చెక్‌పెట్టేందుకే ప్రెస్‌ మీట్‌ పెట్టాను. పైగా ఆ ప్రెస్‌ మీట్‌లో ఎక్కడా నా అభిప్రాయం చెప్పలేదు. సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయినట్లు  ప్రచారం జరిగింది. కనీసం ఆయనతో ఫోన్‌లో కూడా మాట్లాడలేదు. 

పవర్‌ కమిషన్ విచారణలో ఎవరికీ  నోటీసులు ఇవ్వలేదు. కమిషన్‌ ‌ తరఫున 28 మందికి లేఖలు రాశా. కేసీఆర్‌ తప్ప అంతా తమ అభిప్రాయాలు చెప్పారు. వన్‌ ర్యాంక్‌.. వన్‌ పెన్షన్‌ కమిషన్‌లో నేను పని చేశా. అలాంటిది విచారణ కమిషన్‌ చైర్మన్‌ పదవి నుంచి తప్పుకోమని కేసీఆర్‌ లేఖ రాశారు. ఆ లేఖలోనూ సమాజం అంగీకరించని భాష వాడారు.  ఎన్నో కమిషన్‌ చైర్మన్లు ప్రెస్‌ మీట్లు పెట్టినా రాని అభ్యంతరం నాపైనే ఎందుకు వచ్చిందో తెలియడం లేదు.

అందరి అభిప్రాయాలు తీసుకుని నేను నివేదిక కూడా సిద్ధం చేశా.  నేను ఇచ్చే రిపోర్ట్‌  నా వ్యక్తిగతం.. దానిపై ఎవరికీ హక్కులేదు. కమిషన్‌ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అంగీకరించొచ్చు.. అంగీకరించకపోవచ్చు. ఆ ఇచ్చిన రిపోర్ట్‌ను తప్పని ఎవరైనా సవాల్‌ చేయొచ్చు అని అన్నారాయన. అంతకు ముందు..

కేసీఆర్‌ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారన సందర్భంగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విచారణ కమిషన్‌ చైర్మన్‌ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి  ఇచ్చిన లేఖను తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీం బెంచ్‌కు సమర్పించారు. 

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు