Breaking News

జూబ్లీహిల్స్‌ ఫలితాలు.. అభ్యర్థి మృతి

Published on Fri, 11/14/2025 - 07:19

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ఫలితాల వేళ స్థానికంగా విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో మృతి చెందారు. దీంతో, విషాదఛాయలు అములుకున్నాయి.

వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి మహమ్మద్ అన్వర్ చేశారు. అయితే, ఈరోజు కౌంటింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆయన గుండెపోటుతో మృతి చెందారు. దీంతో, వారి కుటంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మహమ్మద్‌ అన్వర్‌ ఎర్రగడ్డలో నివాసం ఉంటున్నారు. 

ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో జరగనుంది. 42 టేబుల్స్‌ ద్వారా 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి రౌండ్ ఫలితం వెల్లడికి గంట సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఒక్కో రౌండు ఫలితానికి కనీసం 40 నిమిషాలు పట్టనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన మధ్యాహ్నం 2 గంటల కల్లా తుది ఫలితం వచ్చేస్తుందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్​ వెల్లడించారు. స్టేడియంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో 14 టేబుళ్లకు బదులు వరుసకు 21 టేబుళ్ల చొప్పున రెండు వరుసల్లో 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండుకు 42 పోలింగ్‌ కేంద్రాల ఈవీఎంల ఫలితం వెల్లడవుతుంది. మొత్తం 407 పోలింగ్‌ కేంద్రాల ఫలితం వెల్లడయ్యేందుకు 10 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. 

 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)