Breaking News

ఆమెను వేశ్యలా చూశారన్న ఆరోపణలు అవాస్తవం: జయష్‌ రంజన్‌

Published on Sun, 05/25/2025 - 18:40

సాక్షి, హైదరాబాద్‌: మిస్ ఇంగ్లాండ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఆమెను వేశ్యలా చూశారన్న ఆరోపణలు అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. ఆమె వ్యాఖ్యలు నిరాధారమన్నారు. తెలంగాణ ఆతిథ్యం నచ్చిందని ఆమె చెప్పారు. తల్లి ఆరోగ్యం బాగోలేదని పోటీ నుంచి తప్పుకున్నారు. ఆమె పట్ల ఎవరు తప్పుగా ప్రవర్తించలేదు’’ అని జయేష్‌ రంజన్‌ చెప్పారు.

‘‘నేను మిస్ వరల్డ్ నిర్వాహకులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నాను. ఆమె కేవలం చౌమహల్లా ప్యాలస్ డిన్నర్‌లో మాత్రమే పాల్గొంది. ప్రతి టేబుల్‌లో పురుషులు, మహిళలు అందరూ ఉన్నారు. ఆమె తోటి పోటీదారులను కూడా విచారించాం. అలాంటిది జరగలేదని చెప్పారు’’ అని జయేష్‌ రంజన్‌ పేర్కొన్నారు.

మిస్‌ వరల్డ్‌  వివాదం.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం..
మరోవైపు, మిస్‌ వరల్డ్‌ వివాదంపై తెలంగాణ సర్కార్‌ విచారణకు ఆదేశించింది. మిస్‌ వరల్డ్‌ పోటీలపై మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి షికా గోయల్‌,  ఐపీఎస్‌ రమా రాజేశ్వరి, సైబరాబాద్‌ డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టింది. మిస్ ఇంగ్లాండ్‌ ఆరోపణల్లో నిజమెంత? మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లు ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారా? అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఈ వివాదంపై పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు.

 

 

 

 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)