Breaking News

ఐటీ దాడుల అప్‌డేట్స్‌: వర్కర్లే బినామీలు!

Published on Tue, 11/18/2025 - 07:36

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఆదాయ పన్ను శాఖ(IT) సోదాల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్లు.. వాటి చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. నాలుగు బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఏకకాలంలో 15 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్యాక్స్‌ మోసాలతో పాటు బినామీ ఆస్తులనూ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.  

నగరంలోని పిస్తా హౌజ్‌, షా గౌస్‌ హోటల్స్‌, మెహిఫిల్‌.. ఇలా పలు బిర్యానీ హోటళ్ల మెయిన్‌ బ్రాంచ్‌లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు రాజేంద్రనగర్ లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్ ,మహమ్మద్ ముస్తాన్ ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. అలాగే మైహిఫిల్‌ రెస్టారెంట్‌లలో.. ఓనర్‌ ఇంట్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. షేక్‌పేటలోని మెహిఫిల్‌ రెస్టారెంట్‌పై తనిఖీలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులకు రికార్డులను పరిశీలించి కంగుతిన్నారు. రెస్టారెంట్‌లో పని చేసే వర్కర్‌లే బినామీలని.. వాళ్ళ పేరు మీదే ప్రాపర్టీలు ఉన్నాయని గుర్తించారు.

సిటీలోనే కాదు.. బయటి దేశాల్లోనూ ఈ రెస్టారెంట్‌లకు బ్రాంచిలు ఉన్నాయి. సంవత్సరంలో వందల కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నాయి. అదే సమయంలో.. హవాలా, నకిలీ లావాదేవీలు, అనుమానాస్పద ట్రాన్‌జాక్షన్స్‌ జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ తనిఖీలకు ప్రాధాన్యత సంతరించుకుంది. సోదాల్లో ట్యాక్స్‌ రికార్డుల్లో చూపిన ఆదాయానికి.. వచ్చిన ఆదాయం మధ్య వ్యత్యాసం గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే ట్యాక్స్‌ చెల్లింపుల్లోనూ వ్యత్యాసాలు బయటపడ్డాయి. 

హైదరాబాద్లో మరోసారి ఐటీ సోదాలు

ఇదీ చదవండి: ఐ బొమ్మ జస్ట్‌ పైరసీ కాదు.. అంతకు మించి!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)