Breaking News

ఈటలతో కేటీఆర్‌ ఆప్యాయ పలకరింపు.. అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం

Published on Thu, 08/03/2023 - 13:20

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను మంత్రి కేటీఆర్‌ అప్యాయంగా పలకరించారు. ఈటల సీటు వద్దకు వెళ్ళి ఆలింగనం చేసుకున్నారు. నేతలు ఒకరినొకరు హత్తుకున్నారు. దాదాపు పది నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. 

అదే విధంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డీతోనూ కేటీఆర్‌ భేటీ అయ్యారు. పలు అభివృద్ది పనుల కోసం కేటీఆర్ చాంబర్‌లో మంత్రికి సంగారెడ్డి ఎమ్మెల్యే వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. జగ్గారెడ్డిని చూడగానే పిల్లలతో కలిసి తిరిగితే ఎట్లా అన్న అంటూ కేటీఆర్‌ సరదాగా వ్యాఖ్యానించారు. అప్పటికే జగ్గారెడ్డితో టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ ఉండగా.. మీ ఇద్దరి దోస్తాన్‌ ఎక్కడ కుదిరిందని కేటీఆర్‌ అడిగారు.

మాది ఒకే మంచం, ఒకే కంచం అంటూ మామిళ్ల బదులివ్వగా.. అయితే జగ్గారెడ్డిని గెలిపిస్తవా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గెలిపిస్తానని.. మన దగ్గరకు (బీఆర్‌ఎస్‌లోకి) పట్టుకొస్తానని మామిళ్ల రాజేందర్‌ నవ్వుతూ చెప్పారు. ఈ సంభాషణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. 
చదవండి: 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీ మీటింగ్‌లో నిర్ణయం

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)