Breaking News

భారత్‌-బంగ్లాదేశ్‌ టీ20 మ్యాచ్‌: ఉప్పల్‌ స్టేడియం వద్ద హైటెన్షన్‌

Published on Sat, 10/12/2024 - 14:58

సాక్షి, హైదరాబాద్‌: ఉప్పల్‌ స్టేడియం వద్ద హైటెన్షన్‌ నెలకొంది. భారత్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ దృష్ట్యా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మరో వైపు, మ్యాచ్‌ను అడ్డుకుంటామంటూ వీహెచ్‌పీ హెచ్చరించిన నేపథ్యంలో స్టేడియం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు బాంబ్, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. 250 మంది సెక్యూరిటీ వింగ్, 400 మంది ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 2,600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ  వెల్లడించారు.

ఉప్పల్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
భారత్‌– బంగ్లాదేశ్‌ల మధ్య  టీ–20 క్రికెట్‌ మ్యాచ్‌ జరుగనున్న నేపథ్యంలో ఉప్పల్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మ్యాచ్‌ జరిగే  సమయాల్లో ఉప్పల్‌ స్టేడియంవైపు భారీ వాహనాలను అనుమతించరు.  వరంగల్‌  నుంచి ఉప్పల్‌ వైపు వచ్చే  భారీ వాహనాలు చెంగిచర్ల ఎక్స్‌రోడ్డు,  చర్లపల్లి ఐఓసీ కేంద్రం, ఎన్‌ఎఫ్‌సీ మీదుగా తమ గమ్యాలను చేరుకోవాలి.

ఇదీ చదవండి: ఉప్పల్‌లో గెలుపెవరిదో!

వరంగల్‌ వైపు నుంచి ఎల్‌బీనగర్‌ వెళ్లాల్సిన వారు ఉప్పల్‌ ఏషియన్‌ ధియేటర్‌ ఎదురుగా భగాయత్‌ రోడ్డు నుంచి నాగోల్‌ బ్రిడ్జి మీదుగా వెళ్లాలి. ఎల్‌బీనగర్‌ నుంచి ఉప్పల్‌ వచ్చే వాహనాలు నాగోల్‌ మెట్రోస్టేషన్, ఉప్పల్‌ భగాయత్‌ నుంచి ఏషియన్‌ ధియేటర్‌  మీదుగా  బోడుప్పల్‌  చేరుకోవాలి. సికింద్రాబాద్‌ నుంచి ఉప్పల్‌ వైపు వచ్చే వాహనాలు  హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం పారిశ్రామిక వాడ ద్వార చెంగిచర్ల మీదుగా  వరంగల్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది. రామంపూర్‌ నుంచి ఉప్పల్‌ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ వీధి నంబర్‌–8 మీదుగా హబ్సిగూడ మెట్రో పిల్లర్‌ 972 వద్ద యూ టర్న్‌ తీసుకుని  ఉప్పల్‌ ఎక్స్‌ రోడ్డుకు చేరుకోవాలి.
 

ఉప్పల్ మ్యాచ్ పై VHP కీలక వార్నింగ్

 


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)