Breaking News

రైల్వే ట్రాక్‌పై 7 కిలో మీటర్లు కారు నడిపి.. ఇంతకీ ఎవరీ యువతి?

Published on Thu, 06/26/2025 - 15:39

సాక్షి, హైదరాబాద్‌: పట్టాలపై కారు నడుపుతూ ఓ యువతి కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, రైల్వే చరిత్రలో ఇలాంటి ఘటన మొదటిసారి అంటూ రైల్వే అధికారులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా రైల్వే శాఖలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొండకల్ వద్ద రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతిని వోమిక సోనీగా గుర్తించారు.  చేవెళ్లలో వైద్య పరీక్షల అనంతరం ఆమెను ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించారు. మానసిక స్థితిపై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

కొండకల్ నుంచి చిన్న శంకర్‌పల్లి వరకు సుమారు 7 కిలోమీటర్లు రైల్వే ట్రాక్‌పై ఆమె కారు నడిపింది. దీంతో  గంట 20 నిమిషాల పాటు రైళ్లను నిలిపివేశారు. 8 ప్యాసింజర్‌, గూడ్స్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం 6.20 నిమిషాల నుంచి 7:40 వరకు ట్రాక్‌ పైనే వోమిక సోనీ కారును నడిపినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె కారును శంకర్‌పల్లి రైల్వే స్టేషన్‌కు తరలించారు.

కారును సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పరిశీలించారు. అందులో డాగ్ బిస్కెట్లు, అగ్గిపెట్టె, డ్రై ఫ్రూట్స్‌ ఉన్నాయి. నాన్ చాక్‌తో స్థానికులపై వోమిక సోనీ దురుసుగా ప్రవర్తించింది. ఆమె మత్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మతిస్థిమితం, డ్రగ్స్ తీసుకున్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

కాగా, వోమిక సోనీ..  గత కొన్నిరోజులగా తల్లిదండ్రులు, భర్తకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఉద్యోగం పొగొట్టుకున్న సోని డ్రిపెషన్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తర ప్రదేశ్ లక్నోకి చెందిన సోనీ స్థానికంగా పుప్పాల గూడలో నివాసం ఉంటుంది. ఆమెపై రైల్వే సెక్షన్లు 147 ట్రేస్ పాస్, 153 రైళ్ల రాకపోకలకు అంతరాయం కింద కేసులు నమోదు చేశారు. కారు నుంచి బయటికి రాకపోవడంతో కారు డోర్స్ బ్రేక్‌ చేసి మరి.. స్థానికులు, అధికారులు బయటికి దింపారు. స్థానికులు, అధికారులపైకి నాన్ చాక్‌తో దాడికి దిగింది.

	రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో ఓ యువతి హలచల్

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)