Breaking News

Weather Update: వాతావరణ శాఖ హెచ్చరిక.. తెలంగాణలో మూడు రోజులు గట్టి వానలే!

Published on Sat, 09/02/2023 - 16:41

సాక్షి, హైదరాబాద్‌: కొద్దిరోజులుగా తెలంగాణవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. వర్షం కోసం ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాగల మూడు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది.

అయితే, తెలంగాణలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భువనగిరి, మహబూబ్‌నగర్‌, హన్మకొండ, భద్రాద్రి, సంగారెడ్డి, రంగారెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఆదివారం నుంచి సోమవారం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

అతి భారీ వర్ష సూచన..
సోమవారం నుంచి మంగళవారం వరకు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని, పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని అంచనా వేసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని వాతావరణ శాఖ వివరించింది.

ఇది కూడా చదవండి: కొత్తవి ఇవ్వరు..పాతవాటిలో చేర్చరు

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు