Breaking News

తెలంగాణకు భారీ వర్షాల అలర్ట్‌.. హైదరాబాద్‌ ముంచెత్తిన జడివాన

Published on Thu, 08/15/2024 - 19:34

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని గురువారం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో పాటు  గంటకు 30 నుంచి 40 కి.మీ తో కూడిన  ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.

మరోవైపు.. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఇదిలా ఉంటే..  మూడురోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతతో ఉక్కపోతతో చంపేస్తున్న హైదరాబాద్ వాతావరణం.. హఠాత్తుగా మారిపోయింది. శుక్రవారం నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మేఘం విరిగిపడిందా? అన్నట్లు వాన కురిసింది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌.. చుట్టుపక్కల ఏరియాల్లో భారీ వాన పడింది. క్యూములోనింబస్ మేఘాలు ముసురుకోవడంతో.. ఒక్కసారిగా ఈ పరిస్థితి నెలకొంది. సెలవు రోజు కావడంతో ట్రాఫిక్‌ చిక్కులు పెద్దగా లేకపోయినా రోడ్లపై నీరు పేరుకుపోవడంతో నగర వాసులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

 

 

హైదరాబాద్‌కు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ.. చుట్టుపక్కల జిల్లాలకు కూడా అదే అలర్ట్‌ ఇచ్చింది. సంగారెడ్డిలో ఎడతెరిపి లేకుండా భారీ వాన పడుతోంది. గుమ్మడిదలలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్ల వర్షం పడింది. బీరంగూడ, అమీన్‌పూర​, పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్, కిష్ణారెడ్డి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. 

 

 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)