Breaking News

వాన అప్పుడే అయిపోలేదు.. మరో ఐదు రోజులు దంచికొట్టుడే!

Published on Thu, 07/20/2023 - 16:21

సాక్షి, హైదరాబాద్‌: ఓవైపు నైరుతి రుతుపవనాల ప్రభావం, మరోవైపు అల్పపీడనం కారణంగా తెలంగాణవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాష్టంలో ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ విభాగం అంచనావేసింది. పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే సూచనలున్నాయని వెల్లడించింది. 

రెండు రోజులు (గురువారం, శుక్రవారం) మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు వాతావారణ శాఖ రెడ్, ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.
(చదవండి: వాన లోటు తీరినట్టే!)

కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడక్కడ అత్యంత భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్,  నారాయణపేట, హైదరాబాద్ జిల్లాలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్‌ జారీ చేశారు.

ఆదిలాబాద్‌, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 
(చదవండి: తెలంగాణలో నేడు, రేపు స్కూల్స్‌ బంద్‌)

Videos

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)