Breaking News

కర్రెగుట్టలో ఐఈడీ పేలుళ్ల కలకలం

Published on Mon, 01/26/2026 - 12:44

సాక్షి,హైదరాబాద్‌ : తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్‌ సరిహద్దు ప్రాంతం కర్రెగుట్టలో బీజాపూర్ జిల్లా, కర్రెగుట్ట కొండల అటవీ ప్రాంతంలో నక్సల్స్  అమర్చిన ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైజ్‌లు (IEDs) పేలాయి.  ఐఈడీలు పేలడంతో 11 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వీరిలో పదిమంది డీఆర్‌జీ సిబ్బంది, ఒకరు కోబ్రా బెటాలియన్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ రుద్రేష్ సింగ్ ఉన్నారు. ఆయనతో పాటు ఇద్దరు డీఆర్‌జీ సిబ్బంది కాళ్లకు గాయాలు కాగా, మరో ముగ్గురి కంటికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని రాయపూర్ ఆసుపత్రిలో చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్సనందిస్తున్నారు. 

కర్రెగుట్ట ప్రాంతం గతంలో నక్సల్స్‌కు సురక్షిత స్థావరంగా ఉండేది. 2025 ఏప్రిల్-మే నెలల్లో 21 రోజులపాటు జరిగిన విస్తృత ఆపరేషన్‌లో 31 మంది నక్సల్స్ హతమయ్యారు. ఆ సమయంలో భద్రతా బలగాలు 35 ఆయుధాలు, 450 ఐఈడీలు, పెద్ద సంఖ్యలో డిటోనేటర్లు, పేలుడు పదార్థాలు, వైద్య సరఫరాలు, విద్యుత్ పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి. గతేడాది నవంబర్‌లో భద్రతా బలగాలు ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తడ్పాల గ్రామంలో శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. ఈ ప్రాంతంలో నక్సల్స్‌ ప్రభావం ఎక్కువ ఉంది.

కాగా,తాజాగా ఐఈడీ పేలుళ్ల ఘటన మరోసారి నక్సల్స్ వ్యూహాత్మక దాడుల తీవ్రతను చూపించింది. భద్రతా బలగాలు నిరంతరం ఆపరేషన్లు కొనసాగిస్తున్నప్పటికీ, ఐఈడీ దాడులు వారికి ప్రధాన సవాలుగా మారాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)