Breaking News

ఐబొమ్మ రవి పొంతనలేని సమాధానాలు..!

Published on Sat, 11/22/2025 - 17:43

హైదరాబాద్‌: జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న ఐబొమ్మ’ పైరసీ సినిమా వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి విచారణకు ఏమాత్రం సహకరించడం లేదు. విచారణలో పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. 

తనను ఏమీ అడిగినా గుర్తు లేదు.. మరిచిపోయా అనేది మాత్రమే చెబుతున్నాడు. ఈరోజు(శనివారం, నవంబర్‌ 22వ తేదీ) మూడో రోజు విచారణలో భాగంగా పోలీసులకు ఐబొమ్మ రవి సహకరించలేదు. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు అడిగితే.. గుర్తు లేవు.. మరిచిపోయా అని మాత్రమే సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.  

ఎథికల్ హ్యాకర్ల సహాయంతో హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్‌లు ఓపెన్ చేస్తున్నారు పోలీసులు.  ఫ్రాన్స్, నెదర్లాండ్స్ లో మెయిన్ సర్వర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే బ్యాంక్ ఖాతాల వివరాలపైనా రవి నోరు విప్పడం లేదు. దాంతో రవి అకౌంట్ల చిట్టా ఇవ్వాలని పలు బ్యాంకులకు మెయిల్ చేశారు పోలీసలు. ప్రతీ 20 రోజులకు ఒక్కో దేశానికి వెళ్లడంపై రవిని ఆరా తీయగా, విదేశీ పర్యటనలు అంటే ఇష్టం ఉండటం వల్లే వెళ్ళాను అని చెప్పినట్లు సమాచారం. 

కాగా, సినిమా పైరసీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐబొమ్మ ఇమ్మడి రవికి నాంపల్లి హైకోర్టు ఐదురోజుల పోలీసు కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. వారం రోజుల పోలీసు కస్టడీ కోరిన సైబర్ క్రైమ్ పోలీసులు.. కేసులో ఉన్న సాంకేతిక అంశాలు, డిజిటల్ ఆధారాలు, నెట్‌వర్క్ లింకులు తదితరాలను విశ్లేషించేందుకు రవిని ప్రత్యక్షంగా విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు వివరించారు. కోర్టు ఈ పిటిషన్‌ను పరిశీలించి ఐదు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది.  దీనిలో భాగంగా ఇప్పటివరకూ మూడు రోజుల విచారణ పూర్తి కాగా, ఇంకా రెండు రోజుల మాత్రమే మిగిలి ఉంది.

ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)