Breaking News

హైడ్రా దూకుడు.. జగద్గిరిగుట్టలో కూల్చివేతలు

Published on Thu, 02/20/2025 - 15:42

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జగద్గిరిగుట్టలోని భూదేవిహిల్స్‌ సమీపంలోని పరికి చెరువు వద్ద ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. గాజులరామారంలోని మహదేవపురం ప్రాంతంలోని కొన్ని బేస్మెంట్లను కూడా కూల్చివేశారు. గత వారం చెరువు పరిరక్షణ సమితి సభ్యులు హైడ్రాకు ఫిర్యాదు చేసిన క్రమంలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

కాగా, నగర శివార్లలో ఫాం ల్యాండ్‌ ప్లాట్ల పేరిట అక్రమ లేఔట్ల అమ్మకాలు జరుగుతున్నాయని, అనుమతి లేని వాటిలో ప్లాట్లు ఖరీదు చేసి ఇబ్బందులు పడొద్దని హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) సోమవారం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఫార్మ్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని తమకు ఫిర్యాదులు వచ్చాయని స్పష్టం చేసింది.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం లక్ష్మీగూడ గ్రామంలోని సర్వే నం.50లోని 1.02 ఎకరాల్లో ఫాం ప్లాట్ల పేరిట లే ఔట్‌ వేసి అమ్మేస్తున్నారని ప్రజావాణి ద్వారా హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ నగర ప్రజలను అప్రమత్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ మున్సిపల్‌ యాక్ట్‌–2019, తెలంగాణ పంచాయత్‌ రాజ్‌ యాక్ట్‌–2018 ప్రకారం ఎక్కడా ఫాం ల్యాండ్‌ ప్లాట్లుగా అమ్మడానికి వీలులేదని ఆయన పేర్కొన్నారు.

జగద్గిరిగుట్టలో హైడ్రా కూల్చివేతలు

ఫాం ల్యాండ్‌ అంటే కనీసం 2 వేల చదరపు మీటర్లు, లేదా 20 గుంటల స్థలం ఉండాలని ప్రభుత్వం గతంలోనే నిర్దేశించిందని వివరించారు. ఈ మేరకు ఫాం ప్లాట్లురిజిస్ట్రేషన్లు చేయరాదని స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖకు ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు కూడా ఇచి్చందని రంగనాథ్‌ తెలిపారు. జీవో నం.131 ప్రకారం 2020 ఆగస్టు 31 తర్వాత వెలసిన అక్రమ లేఔట్లలోని ప్లాట్లలో ఇల్లు నిరి్మంచడానికి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం గుర్తించాలని కోరారు.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)